King Charles III: ఒంటరిగా వచ్చిన ప్రిన్స్ హ్యారీ పట్టాభిషేకం ముగియగానే ఏం చేశారు?

King Charles III: అంతదూరం నుంచి, చాలా కాలం తర్వాత తన సొంత రాజ కుటుంబ సభ్యులను కలిసిన ప్రిన్స్ హ్యారీ వారితో కలిసి కనీసం నాలుగు రోజులైనా ఎందుకు ఉండలేదు?

King Charles III: ఒంటరిగా వచ్చిన ప్రిన్స్ హ్యారీ పట్టాభిషేకం ముగియగానే ఏం చేశారు?

King Charles III

King Charles III: కింగ్ ఛార్లెస్-III (King Charles III) పట్టాభిషేకానికి ఒంటరిగా హాజరైన డ్యూక్ ఆఫ్ ససెక్స్ (Duke of Sussex) ప్రిన్స్ హ్యారీ (Prince Harry), ఆ కార్యక్రమం ముగియగానే అక్కడి నుంచి తిరిగి అమెరికా వెళ్లిపోయారు. కింగ్ ఛార్లెస్-IIIకి ప్రిన్స్ హ్యారీ చిన్న కొడుకు.

హ్యారీ సతీమణి మేఘన్ మార్కెల్ (Meghan Markle) పట్టాభిషేక మహోత్సవానికి హాజరు కాలేదు. పట్టాభిషేకం ముగిసిన వెంటనే ఓ ప్రేక్షకుడిలా ప్రిన్స్ హ్యారీ.. యూకేలోని హీత్రో విమానాశ్రయం నుంచి బ్రిటిష్ ఎయిర్‌వేస్ విమానంలో లాస్ ఏంజెల్స్ కు వెళ్లిపోయారు. పట్టాభిషేక మహోత్సవానికి ప్రిన్స్ హ్యారీ వస్తారని మేఘన్ మార్కెల్ తమ పిల్లలతో కాలిఫోర్నియాలోనే ఉంటారని రాజ కుటుంబం ముందుగానే ప్రకటించిన విషయం తెలిసిందే.

రాయల్ ఫ్యామిలీలో ప్రిన్స్ హ్యారీ క్రియాశీలకంగా లేకపోవడంతో ఆయన పట్టాభిషేకంలో కుటుంబ సభ్యుల మధ్య కూర్చున్నప్పటికీ మనస్ఫూర్తిగా అక్కడ ఉండలేకపోయినట్లు కథనాలు వస్తున్నాయి. ఆయన ప్లాస్టిక్ నవ్వులు చిందించారు. ప్రిన్స్ హ్యారీ అంతకుముందు ఒంటరిగా ప్రేక్షకుడిలా కూర్చున్నారు. రాజ కుటుంబంలోని ఇతర వారసులు అందరూ సంప్రదాయబద్ధంగా పట్టాభిషేకంలో కీలక పాత్ర వహించారు.

ప్రిన్స్ హ్యారీ, మేఘన్ మార్కెల్ కుమారుడు ప్రిన్స్ ఆర్చీ నాలుగవ పుట్టినరోజు వేడుక కూడా నిన్నే జరిగింది. ప్రిన్స్ ఆర్చీ పుట్టినరోజు జరుపుకుంటున్న సమయంలోనే కింగ్ ఛార్లెస్-III పట్టాభిషేకానికి ముహూర్తం ఎందుకు పెట్టారని వాదనలు కూడా జరిగినట్లు ప్రచారం జరిగింది. కాగా, హ్యారీ, మేఘన్ ఇద్దరూ 2020లో రాయల్ ఫ్యామిలీని బ్రిటన్ ను వీడి అమెరికా వెళ్లిపోయారు. ప్రిన్స్ హ్యారీకి, ఆయన అన్న విలియమ్స్ మధ్య విభేదాలు ఉండడమే ఇందుకు కారణం.

King Charles III: ఈ కాలంలో పట్టాభిషేకాలు ఏంటని ఆందోళనలు.. 52 మంది అరెస్టు.. వీడియో