Ukraine’s Odesa: ఇరాన్ డ్రోన్లతో ఉక్రెయిన్ పోర్టుపై రష్యా దాడి.. 15 లక్షల మందికి విద్యుత్తు కట్

రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఉక్రెయిన్ లోని పలు ప్రాంతాల్లో రష్యా డ్రోన్లతో దాడులు చేస్తోంది. తాజాగా, ఉక్రెయిన్ లోని ఒడెసా సముద్ర పోర్టుపై ఇరాన్ డ్రోన్లతో రష్యా దాడులు చేసింది. దీంతో ఆ ప్రాంతంలోని రెండు విద్యుత్ తయారీ కేంద్రాలు ధ్వంసమై, 15 లక్షల మందికి విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. ఒడెసా ప్రాంతంలో పరిస్థితులు క్లిష్టతరంగా ఉన్నాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ చెప్పారు.

Ukraine’s Odesa: ఇరాన్ డ్రోన్లతో ఉక్రెయిన్ పోర్టుపై రష్యా దాడి.. 15 లక్షల మందికి విద్యుత్తు కట్

russia ukraine tortured prisoners of war says un Human rights office

Ukraine’s Odesa: రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఉక్రెయిన్ లోని పలు ప్రాంతాల్లో రష్యా డ్రోన్లతో దాడులు చేస్తోంది. తాజాగా, ఉక్రెయిన్ లోని ఒడెసా సముద్ర పోర్టుపై ఇరాన్ డ్రోన్లతో రష్యా దాడులు చేసింది. దీంతో ఆ ప్రాంతంలోని రెండు విద్యుత్ తయారీ కేంద్రాలు ధ్వంసమై, 15 లక్షల మందికి విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. ఒడెసా ప్రాంతంలో పరిస్థితులు క్లిష్టతరంగా ఉన్నాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ చెప్పారు.

రష్యా చేసిన ఈ దాడుల వల్ల విద్యుత్తును తిరిగి పునరుద్ధరించడానికి కొన్ని రోజుల సమయం పడుతుందని ఆయన అన్నారు. అక్టోబరు నుంచి ఉక్రెయిన్ లోని విద్యుత్ రంగ సౌకర్యాలపై రష్యా క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేస్తోంది. ఉక్రెయిన్ లో విద్యుత్తు వ్యవస్థ పునరుద్ధరణకు నార్వే నుంచి సాయం అందుతోందని జెలెన్ స్కీ చెప్పారు.

ఒడెసా ప్రాంత ప్రజలకు తిరిగి విద్యుత్ ను పునరుద్ధరించే ప్రక్రియను ప్రారంభించడానికి కొన్ని రోజుల సమయం పడుతుందని, అయితే, పూర్తి స్థాయిలో పునరుద్ధరించడానికి దాదాపు మూడు నెలల సమయం పడుతుందని అక్కడి అధికారులు తెలిపారు. రష్యా దాడులు చేస్తోన్న ప్రాంతాల్లో ప్రజలను ఖాళీ చేయించే ప్రక్రియను కూడా ఉక్రెయిన్ అధికారులు కొనసాగిస్తున్నారు. రష్యా చేస్తున్న దాడులను ఎదుర్కోవడంలో ఉక్రెయిన్ ప్రదర్శిస్తోన్న ధైర్యం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

Viral Video: రహదారిపై ఎస్‌యూవీలో వెళ్తూ స్టీరింగ్ వదిలేసి ప్లే కార్డ్స్ ఆడిన యువకుడు