King Charles III Video: ఈ కాలంలో చూడలేమనుకున్న అద్భుత దృశ్యం.. బంగారు రథంపై రాజు, రాణి ఊరేగింపు, పట్టాభిషేకం

King Charles III: రాజుల కాలంలో సామ్రాజ్యంలోని ప్రజలు రాజుల ఊరేగింపులను రోడ్ల పక్కన నిలబడి చూసేవారు. ఇప్పుడు కూడా యూకే ప్రజలు రోడ్ల పక్కన నిలబడి ఈ అద్భుత దృశ్యాలను చూశారు.

King Charles III Video: ఈ కాలంలో చూడలేమనుకున్న అద్భుత దృశ్యం.. బంగారు రథంపై రాజు, రాణి ఊరేగింపు, పట్టాభిషేకం

King Charles III

King Charles III: రాజుల కాలంలో బంగారు రథాలపై రాజులు, రాణుల ఊరేగింపులు, సింహాసనాలపై కూర్చోబెట్టి పట్టాభిషేకాలు వంటివి జరిగేవి. ఇది రాజుల కాలం కాదు. ఈ కాలంలో ఇటువంటి దృశ్యాలు మనం చూడలేమని అనుకుంటాం. బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్‌-II (Queen Elizabeth) గత సెప్టెంబరులో కన్నుమూయడంతో బ్రిటన్ రాజుగా ఆమె కుమారుడు కింగ్ ఛార్లెస్-III (King Charles III) పట్టాభిషేకం ఇవాళ జరిగింది.


King Charles III

King Charles III Coronation

King Charles III Coronation

కింగ్ ఛార్లెస్ పట్టాభిషేకం (King Charles III Coronation) ముందు లండన్ లో వేల్స్ చర్చి ఆధ్వర్యంలో క్రిస్టియన్ సాంప్రదాయ పద్ధతుల్లో ఊరేగింపు జరిగింది. రాజుల కాలంలో సామ్రాజ్యంలోని ప్రజలు రాజుల ఊరేగింపులను రోడ్ల పక్కన నిలబడి చూసేవారు. ఇప్పుడు కూడా యూకే ప్రజలు రోడ్ల పక్కన నిలబడి ఈ అద్భుత దృశ్యాలను చూశారు. 70 ఏళ్లలో జరుగుతోన్న మొదట ఊరేగింపు ఇది.

ఇంగ్లండ్‌లోని వెస్ట్‌మిన్‌స్టర్ చర్చిలో నుంచి కింగ్ చార్లెస్, ఆయన భార్యామణి కామిల్లా పార్కెర్ బంగారు రథం “గోల్డ్ స్టేట్ కోచ్”లో బకింగ్‌హామ్ ప్యాలెస్ వరకు వెళ్లారు. ఈ రథం 260 ఏళ్ల క్రితం నాటిది. బ్రిటిష్ రాజు, రాణిల పట్టాభిషేక మహోత్సవ ఊరేగింపు కోసం దీన్ని 1831 నుంచి ఉపయోగిస్తున్నారు.

Rishi Sunak

కింగ్ ఛార్లెస్-III (King Charles III) పట్టాభిషేకం సందర్భంగా బ్రిటన్ ప్రధాని రిషి సునక్ Epistle to the Colossians నుంచి మొదటి ఛాప్టర్ చదివి వినిపించారు.

King Charles III Coronation

Prince Harry arrives alone

Prince Harry arrives alone

కింగ్ ఛార్లెస్-III (King Charles III) పట్టాభిషేకం మీద ఉన్న వేళ ఆయన చిన్న కోడలు మేఘన్ మార్కెల్ (Meghan Markle) ఈ మహోత్సవానికి హాజరు కాలేదు. మేఘన్ భర్త ప్రిన్స్ హ్యారీ హాజరై ప్రేక్షకుడిలా దూరంగా కూర్చొని ఉండిపోయారు. ఆయన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

𝐓𝐡𝐞 𝐂𝐫𝐨𝐰𝐧𝐢𝐧𝐠 𝐨𝐟 𝐓𝐡𝐞 𝐊𝐢𝐧𝐠

కిరీటం ధరిస్తోన్న రాజు (All Pics Credit @RoyalFamily)

కింగ్ చార్లెస్ పట్టాభిషేక మహోత్సవం ముగిసింది. కింగ్ చార్లెస్ కిరీటం ధరించారు.

King Charles Coronation : బ్రిటన్ కింగ్ ఛార్లెస్‌కు ముంబై డబ్బావాలాల ‘పునెరీ పగఢీ’ కానుక .. దీని ప్రత్యేక ఏమిటంటే..