కరోనాపై తప్పుడు యాడ్ ఇస్తే ఖతమే.. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ కొరడా..!

తప్పుడు యాడ్‌లపై సోషల్ మీడియా దిగ్గజాలు కొరడా ఝళిపిస్తున్నాయి. తప్పుగా యాడ్స్ ఇచ్చినట్టుగా గుర్తిస్తే మాత్రం ఆయా యాడ్స్ వెంటనే బ్యాన్ చేసేస్తున్నాయి. ప్రత్యేకించి ప్రపంచాన్ని వణికి

కరోనాపై తప్పుడు యాడ్ ఇస్తే ఖతమే.. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ కొరడా..!

తప్పుడు యాడ్‌లపై సోషల్ మీడియా దిగ్గజాలు కొరడా ఝళిపిస్తున్నాయి. తప్పుగా యాడ్స్ ఇచ్చినట్టుగా గుర్తిస్తే మాత్రం ఆయా యాడ్స్ వెంటనే బ్యాన్ చేసేస్తున్నాయి. ప్రత్యేకించి ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ కు సంబంధించి తప్పుడు యాడ్స్ డిస్ ప్లే చేసేవారిపై ఫేస్‌బుక్, ఇన్ స్ట్రాగ్రామ్ ఓ కన్నేసి ఉంచాయి.

కరోనా వైరస్ (COVID-19) వ్యాధి నయ కావడం, ప్రేరేపించడం లేదా రెచ్చగొట్టడం, అత్యవసర భావన’ తో కూడిన యాడ్స్ తమ ప్లాట్ ఫాంపై కనిపిస్తే వెంటనే బ్యాన్ చేసేస్తున్నాయి. తప్పుడు యాడ్స్ నియంత్రించేందుకు వీలుగా ఈ చర్యలను చేపట్టినట్టు సోషల్ మీడియా కంపెనీలు ఒక ప్రకటనలో వెల్లడించాయి. కరోనా వైరస్ సంబంధిత యాడ్స్ పై ఇటీవలే ఓ పాలసీని అమల్లోకి తీసుకొచ్చామని తెలిపాయి.

ఒక్క ఫేస్ బుక్ ప్లాట్ ఫాంపై మాత్రమే కాదని, ఇన్ స్టాగ్రామ్ ప్లాట్ ఫాంపై కూడా ఇదే తరహాలో పాలసీలను అమల్లోకి తీసుకొచ్చినట్టు పేర్కొన్నాయి. కరోనా వైరస్ పేరుతో యాడ్స్ రన్ చేస్తూ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తిచేస్తున్నట్టు ఫేస్ బుక్ విశ్వసిస్తోంది.

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కారణంగా 79వేల మందికి సోకగా, గత కొన్ని నెలలుగా 2,600 మంది మృత్యువాత పడ్డారు. గత జనవరి నెలలో నుంచే ఫేస్ బుక్ తమ ప్లాట్ ఫాంపై వ్యాప్తి చేసే తప్పుడు సమాచారాన్ని తొలగిస్తోంది. తమ న్యూస్ ఫీడ్‌పై కనిపించే ప్రతి తప్పుడు సమాచారాన్ని గుర్తించి సోషల్ ఫ్యాక్ట్ చెకర్స్ ద్వారా ప్లాట్ ఫాంపై నుంచి డిలీట్ చేస్తున్నాయి.