Julia Hawkins : బామ్మా నువ్వు సూపర్.. 105 ఏళ్ల వయసులో వరల్డ్ రికార్డ్

ఈ రోజుల్లో ఓ మనిషి వందేళ్లు బతికి ఉండటమే గొప్ప విషయం. చాలా గ్రేట్ గా భావించాలి. బతికి ఉండటమే గొప్ప సంగతి అనుకుంటుంటే, అలాంటిది ఆ వయసులో ప్రపంచ రికార్డు సృష్టించడం అంటే మాటలు కాదు.

Julia Hawkins : బామ్మా నువ్వు సూపర్.. 105 ఏళ్ల వయసులో వరల్డ్ రికార్డ్

Julia Hawkins

Julia Hawkins : ఈ రోజుల్లో ఓ మనిషి వందేళ్లు బతికి ఉండటమే గొప్ప విషయం. చాలా గ్రేట్ గా భావించాలి. బతికి ఉండటమే గొప్ప సంగతి అనుకుంటుంటే, అలాంటిది ఆ వయసులో ప్రపంచ రికార్డు సృష్టించడం అంటే మాటలు కాదు. సాధారణంగా వందేళ్ల వయసులో కాలు కదపడమే కష్టం. కర్ర సాయం లేకుండా ఒక్క అడుగు ముందుకు వేసినా అద్భుతమే.

అలాంటిది పరుగు పందెంలో పాల్గొనడం అంటే మాటలు కాదు. ఓ బామ్మ అద్భుతం చేసిందనే చెప్పాలి. 105 ఏళ్ల వయసులో పరుగు పందెంలో పాల్గొని ఎవరికీ సాధ్యం కాని రికార్డును నెలకొల్పింది.

Read More : Post-Mortem : ఇకపై రాత్రి పూట కూడా పోస్టుమార్టం.. కేంద్రం కీలక నిర్ణయం

ఆమె పేరు జులియా హాకిన్స్. అమెరికాలోని లూసియానాకు చెందిన ఆమె వయసు 105 ఏళ్లు. రిటైర్డ్ టీచర్ అయిన జులియా ఈ వయసులోనూ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసింది. తనకు 101 సంవత్సరాలు వచ్చినప్పటి నుంచి రన్నింగ్ చేయడం ప్రారంభించానని బామ్మ తెలిపింది.

80 ఏళ్ల వయసులో నేషనల్ సీనియర్ గేమ్స్‌లో పాల్గొనడంతో.. ఆ అనుభవాన్ని ఉపయోగించి పరుగెత్తే దాన్ని అని వివరించింది. ఇటీవల 100 మీటర్ల స్ప్రింటింగ్ పోటీల్లో పాల్గొని కేవలం నిమిషం రెండు సెకన్ల వ్యవధిలో పరుగును పూర్తి చేసి ప్రపంచ రికార్డును సాధించింది. ప్రపంచంలో ఈ ఫీట్ పూర్తి చేసిన అత్యంత వృద్ధ మహిళగా జులియా హాకిన్స్ చరిత్ర సృష్టించింది.