Flight Cancelled : పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు-పండగల వేళ 11,500 విమానాలు రద్దు

ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపధ్యంలో విమాన ప్రయాణాలపై ఆంక్షలు ఎక్కువయ్యాయి. అమెరికా వంటి దేశాలలో ఇది పండుగ సీజన్. క్రిస్మస్, న్యూఇయర్ వేళ అంతర్జాతీయ ప్రయాణికులత

Flight Cancelled : పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు-పండగల వేళ 11,500 విమానాలు రద్దు

Flights Cancelled

Flight Cancelled :  ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపధ్యంలో విమాన ప్రయాణాలపై ఆంక్షలు ఎక్కువయ్యాయి. అమెరికా వంటి దేశాలలో ఇది పండుగ సీజన్. క్రిస్మస్, న్యూఇయర్ వేళ అంతర్జాతీయ ప్రయాణికులతో విమానాశ్రయాలు రద్దీ గా ఉంటాయి. ఒమిక్రాన్ భయంతో గత శుక్రవారం నుంచి ఇప్పటి వరకు 11,500 విమానాలు రద్దయినట్లు తెలుస్తోంది.

యూరోప్, అమెరికాలో కోవిడ్ కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి.  11వేలకు పైగా  విమానాలు రద్దవటమే  కాకుండా వేలాది విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఒమిక్రాన్ భయంతో సిబ్బంది విధులకు హాజరు కాకపోవటం కూడా విమానాల రద్దుకు ఒక కారణంగా తెలుస్తోంది.

ఫ్లయిట్ ట్రాకర్ ఫ్లయిట్ అవేర్ లెక్కల ప్రకారం సోమవారం ముడు వేల విమానాలు రద్దయ్యాయి. ఈ రోజు మరో 1100 విమానాలు రద్దు చేశారు. అమెరికాలో పరిస్ధిత మరీ దారుణంగా ఉంది. ఉద్యోగుల సంఖ్య తగ్గిపోవటంతో లేబర్ షార్టేజ్ ఏర్పడింది. దీంతో అమెరికా అంటువ్యాధుల విభాగం కొత్త నిర్ణయం తీసుకుంది. కోవిడ్ లక్షణాలు లేని కేసుల్లో హోం ఐసోలేషన్ వ్యవధిని తగ్గించింది. ఐసోలేషన్ గడువును 10 రోజులనుంచి ఐదు రోజులకు తగ్గించింది.

Also Read : Covid Vaccination: కొవిడ్ వ్యాక్సినేషన్‌పై కేంద్రం స్పెషల్ ఫోకస్.. 3వ డోస్ గైడ్ లైన్స్‌పై నేడు కీలక భేటీ

ఐరోపాలో వ్యాక్సినేషన్ సంఖ్య పెంచటానికి కృషి చేస్తున్నారు. కోవిడ్ వల్ల ఆస్పత్రిలో చేరే ఎక్కువమంది వ్యాక్సినే వేయించుకోని వారే అని తేలింది. దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరగటంతో అవసరమైన చోట ఉద్యోగులను  వారానికి మూడు రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయించాలని మంత్రులు పిలుపు నిచ్చారు.

మరో వైపు కరోనా పుట్టిన చైనా లోని జియాన్ లో కోవిడ్ వ్యాప్తి నిరోధనాకి అధికారులు  ప్రయత్నాలు చేస్తున్నారు. ఫిబ్రవరి లో జరిగే బీజింగ్ ఒలింపిక్స్ కు ముందు కోవిడ్ నియంత్రించేందుకు అధికారులు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. సరిహద్దుల్లో తనిఖీలు, ప్రజలు ఇళ్లకే పరిమితమవటం వంటి వాటిని అమలు చేస్తున్నారు. జియాన్‌లో  13 మిలియన్ల మంది ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఈనిబంధనలు సోమవారం నుంచి మరింత కఠినతరం చేశారు.