Canada : కెనడా ఎన్నికల్లో 17 మంది భారత సంతతి వ్యక్తులు విజయం

కెనడా ఎన్నికల్లో ఏ పార్టీ మెజార్టీ సాధించలేదు. భారత సంతతి వ్యక్తి జ‌గ్‌మీత్ సింగ్ నేతృత్వంలోని న్యూ డెమోక్ర‌టిక్ పార్టీ మద్దతుతో లిబరల్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.

Canada : కెనడా ఎన్నికల్లో 17 మంది భారత సంతతి వ్యక్తులు విజయం

Canada

Canada : కెనడా పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీ మెజార్టీ సాధించలేదు. భారత సంతతి వ్యక్తి జ‌గ్‌మీత్ సింగ్ నేతృత్వంలోని న్యూ డెమోక్ర‌టిక్ పార్టీ మద్దతుతో లిబరల్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. జ‌స్టిన్ ట్రూడో మూడవ సారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఇక తాజాగా జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 17 మంది భారత సంతతి వ్యక్తులు ఎంపీలు విజయం సాధించారు.

Read More :  AP Parishad Elections : ఏపీ పరిషత్‌ ఎన్నికల్లో వైసీపీ హవా..5,916 స్థానాలు కైవసం

మాజీ మంత్రులు టిమ్ ఉప్ప‌ల్‌, హ‌ర్జిత్ సింగ్ స‌జ్జ‌న్‌, బర్దిశ్ చాగ‌ర్‌, అనితా ఆనంద్‌లు కూడా మ‌ళ్లీ ఎన్నిక‌య్యారు. వాంకోవ‌ర్ నుంచి ర‌క్ష‌ణ మంత్రి హ‌ర్జిత్ సింగ్ స‌జ్జ‌న్ రెండోసారి గెలిచారు. వాట‌ర్‌లూ సీటు నుంచి ఛాగ‌ర్ విజ‌యం సాధించారు. బ్రిటీష్ కొలంబియా నుంచి సుఖ్ ద‌లివాల్‌, క్యుబెక్ నుంచి ఇండో కెన‌డియ‌న్ అంజూ ధిల్లాన్ మ‌రోసారి ఎంపీ విజయం సాధించారు.

Read More : MPTC Elections Results : చంద్రబాబు ఇలాకాలో చరిత్ర తిరగ రాసిన అశ్విని

నేపియ‌న్ సీటు నుంచి చంద్ర ఆర్యా విజ‌యం సాధించారు. స‌ర్రీ సెంట‌ర్ నుంచి ర‌ణ్‌దీప్ సింగ్ సారాయి గెలిచారు. కాల్గ‌రి ఫారెస్ట్ లాన్ స్థానం నుంచి జ‌స్‌రాజ్ సింగ్ హ‌ల్ల‌న్ విక్ట‌రీ కొట్టారు. ఎడ్మంట‌న్ మిల్ వుడ్స్ నుంచి ఉప్ప‌ల్ మ‌రోసారి గెలుపొందారు. ఎంపీలు మ‌ణింద‌ర్ సిద్దూ, రూబీ స‌హోటా, సోనియా సిద్దు, క‌మ‌ల్ ఖేరాలు విజయం సాధించారు.