AP Parishad Elections : ఏపీ పరిషత్‌ ఎన్నికల్లో వైసీపీ హవా..5,916 స్థానాలు కైవసం

ఏపీ పరిషత్‌ ఎన్నికల్లో ప్యాన్‌ గాలి బలంగా వీచింది. వైసీపీ విజయ పరంపర కొనసాగింది. రాష్ట్ర ప్రజలంతా వైసీపీకి పట్టం కట్టారు. పరిషత్‌ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను తన ఖాతాలో వేసుకుంది.

AP Parishad Elections : ఏపీ పరిషత్‌ ఎన్నికల్లో వైసీపీ హవా..5,916 స్థానాలు కైవసం

Ycp

YCP wins Majority seats : ఏపీ పరిషత్‌ ఎన్నికల్లో ప్యాన్‌ గాలి బలంగా వీచింది. వైసీపీ విజయ పరంపర కొనసాగింది. రాష్ట్ర ప్రజలంతా వైసీపీకి పట్టం కట్టారు. ప్రతిపక్ష పార్టీ కనీసం పోటీ కూడా ఇవ్వకపోవడంతో… అధికార వైసీపీ పరిషత్‌ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను తన ఖాతాలో వేసుకుంది. అన్ని జిల్లాల్లో దాదాపు 80శాతం ఎంపీటీసీ స్థానాను కైవసం చేసుకుంది వైసీపీ. జెడ్పీటీసీ స్థానాల్లోనూ ఫ్యాన్‌కు తిరుగులేకుండా పోయింది. అన్ని జెడ్పీ పీఠాలను వైసీపీ క్లీన్‌స్విప్‌ చేసే దిశగా వెళ్తోంది.

ఏపీలో మొత్తం 10వేల 47 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. వీటిలో 2వేల 371 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. దీంతో మిగిలిన 7219 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. వీటిలో ఇప్పటి వరకు 7వేల 98 స్థానాలకు ఫలితాలు ప్రకటించారు. ఇందులో 5వేల 916 స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంది. టీడీపీ కేవలం 809 స్థానాలతోనే సరిపెట్టుకుంది. ఇక జనసేన 164 చోట్ల, బీజేపీ 27 స్థానాల్లో విజయం సాధించారు. సీపీఐ 15, సీపీఎం 8 ఎంపీటీసీ స్థానాలను గెల్చుకున్నాయి. కాంగ్రెస్‌ కేవలం 3 ఎంపీటీసీ స్థానాల్లో గెలుపొందింది.

TTD Sarva Darshanam : సర్వదర్శనం టోకెన్ల్ పెంచిన టీటీడీ

జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాల్లోనూ ఫ్యాన్‌ ప్రభంజనం సృష్టించింది. రాష్ట్రంలో మొత్తం 660 జెడ్పీటీసీ స్థానాలు ఉండగా.. వీటిలో 126 ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 515 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగగా…. వీటిలో ఇప్పటి వరకు 471చోట్ల ఫలితాలు ప్రకటించారు. ఇందులో 462 స్థానాల్లో వైసీపీ విజయకేతనం ఎగురవేసింది. టీడీపీ కేవలం 6 చోట్ల మాత్రమే విజయం సాధించింది. ఇక సీపీఎం, జనసేన చెరోచోట గెలుపొందగా.. మరోచోట స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు.

జెడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీ తిరుగులేని పార్టీగా అవతరించింది. జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో అపూర్వ విజయం సాధించింది. ఆరు జిల్లాల్లో క్లీన్‌స్విప్‌ చేసింది. విజయనగరం, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కర్నూలు , గుంటూరు జిల్లాల్లోని అన్ని జెడ్పీటీసీ స్థానాలను గెలుచుకుంది వైసీపీ. ప్రకాశం జిల్లాలో జరిగిన 41జెడ్పీటీసీ స్థానాల్లో అన్నింటి వైసీపీ విజయం సాధించింది. విజయనగరంలో 31 జెడ్పీస్థానాలకు ఎన్నికలు జరుగగా… 31 చోట్ల విజయఢంకా మోగించి తన ఖాతాలో వేసుకుంది.

AP Elections: ఎన్నికల మూడ్‌లోకి వైసీపీ.. రంగంలోకి ప్రశాంత్ కిషోర్ టీమ్

ఇక కర్నూలు జిల్లాలోని 36 స్థానాలను మొత్తం తన సొంతం చేసకుని సరికొత్త రికార్డు నెలకొల్పింది. చిత్తూరు జల్లాలో 33 జెడ్పీటీసీ స్థానాలకు గానూ…33ను వైసీపీ విజయనాదం మోగించింది. ఇక నెల్లూరులో 34 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగగా…. అన్నిచోట్ల వైసీపీ జెండా ఎగిరింది. అంతేకాదు… గుంటూరు జిల్లాలో ఎన్నికలు నిర్వహించిన 45 చోట్ల వైసీపీ విజయపతాకం ఎగరవేఇంది. దీంతో ఆరు జిల్లాల్లో ఏపార్టీకి స్థానంలేకుండా చేసి అన్ని సీట్లను తనఖాతాలో వేసుకుని క్లీన్‌స్విప్‌ చేసింది.

పరిషత్‌ ఎన్నికల ఫలితాల్లోనూ ప్రతిపక్ష టీడీపీ బోర్లా పడింది. ఆ పార్టీకి ఏ జిల్లాలోనూ చెప్పుకోదగ్గ ఫలితాలు రాలేదు. చివరికి చంద్రబాబు సొంత ఊరు నారావారిపల్లె, ఎన్టీఆర్‌ స్వగ్రామం నిమ్మకూరులోనూ టీడీపీని పరాజయం పలకరించింది. తొలిసారి రెండుచోట్ల వైసీపీ జెండా రెపరెపలాడింది. ఈ ఎన్నికల్లో ఇక జనసేన కూడా ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది. బీజేపీకి అయితే ఇతరులకు వచ్చినట్టు సీట్లు కూడా రాలేదు. మొత్తంగా ఈ ఎన్నికల్లో ప్రతిపక్షపార్టీలు పూర్తిగా తేలిపోయాయి.

Actor Sonu Sood : పన్నులు ఎగ్గొట్టి సోనూసూద్ విలన్‌గా మారారా ?

దేవుడి దయ, ప్రజల చల్లని దీవెనలతోనే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించామన్నారు ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి. ప్రజల ప్రేమాభిమానాలు ప్రతి కుటుంబంపట్ల తన బాధ్యతను మరింత పెంచాయన్నారు. వైసీపీకి అఖండ విజయాన్నందించిన రాష్ట్ర ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ అమలు జరుపుతూ.. వారి అభివృద్ధి, సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తామన్నారు.