AP Elections: ఎన్నికల మూడ్‌లోకి వైసీపీ.. రంగంలోకి ప్రశాంత్ కిషోర్ టీమ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల మూడ్ స్టార్ట్ అవ్వబోతుందా? అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండన్నరేళ్లకే మళ్లీ ఎన్నికలకు సిద్ధం అవ్వాలంటూ నాయకులకు, మంత్రులకు సూచనలు చేస్తోందా?

AP Elections: ఎన్నికల మూడ్‌లోకి వైసీపీ.. రంగంలోకి ప్రశాంత్ కిషోర్ టీమ్

Jagan

AP Elections: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల మూడ్ స్టార్ట్ అవ్వబోతుందా? అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండన్నరేళ్లకే మళ్లీ ఎన్నికలకు సిద్ధం అవ్వాలంటూ నాయకులకు, మంత్రులకు సూచనలు చేస్తోందా? అవుననే సమాధానమే వినిపిస్తోంది. ప్రభుత్వం వేస్తున్న అడుగులు చూస్తొంటే, ఎన్నికల మూడ్ వచ్చినట్లే కనిపిస్తుంది. జమిలి ఎన్నికల నిర్వహణ అంశం కేంద్రం పరిశీలనలో ఉందని రాజ్యసభలో ప్రకటన రాగానే, ఏపీలో కూడా వ్యూహకర్తలను రంగంలోకి దింపేస్తుంది వైసీపీ.

ఈ క్రమంలోనే లేటెస్ట్‌గా మరోసారి రంగంలోకి ప్రశాంత్ కిషోర్ టీమ్ వచ్చినట్లుగా తెలుస్తుంది. వైసీపీకి మరిసారి పీకే టీమ్ పని చేయనున్నట్లుగా తెలుస్తుంది. ఎన్నికల మూడ్‌లోకి వెళ్లాలని మంత్రులకు సీఎం జగన్ సూచించినట్లుగా తెలుస్తుంది. వచ్చే ఏడాది నుంచి ఎన్నికల మూడ్ వస్తుందని కాబినెట్‌లో ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చేశారు.

ప్రశాంత్ కిషోర్ అండ్ టీం ఈ సారి కూడా ఎన్నికలకు వ్యూహకర్తలుగా ఉంటారని సీఎం కేబినేట్ మంత్రులతో వ్యాఖ్యానించినట్లుగా తెలుస్తోంది. కేబినేట్‌లో 80శాతం ఎన్నికల టీంగా ఉంటారని చెప్పిన సీఎం.. పీకే టీమ్‌కి వారిని అనుసంధానం చెయ్యనున్నట్లుగా చెబుతున్నారు. కాగా, వన్‌ నేషన్, వన్‌ ఎలక్షన్‌ ఆలోచనతో కేంద్రం కూడా ముందస్తు ఎన్నికలకు వచ్చే అవకాశం ఉండగా.. ఈ క్రమంలోనే పీకే టీమ్ ఏపీలోకి ఎంట్రీ ఇచ్చినట్లుగా చెబుతున్నారు.