‘Honor Killing’ : యువతిని రైఫిల్స్ తో కాల్చి చంపిన 10మంది బంధువులు

బంధువుల అబ్బాయిని పెళ్లి చేసుకోను తను ఇష్టపడినవాడినే చేసుకుంటానని చెప్పిన యువతిని కన్న తండ్రీ, తోడబుట్టిన సోదరులతో సహా 10మంది కలిసి రైఫిళ్లతో కాల్చి చంపారు. ఈ ఘటనపై నిరసనలు వెల్లువెత్తాయి.

‘Honor Killing’ : యువతిని రైఫిల్స్ తో కాల్చి చంపిన 10మంది బంధువులు

'honor Killing'in Syria (1)

‘Honor Killing’In Syria : వివాహం అంటే ఇష్టపూర్వకంగా జరగాలి. లేదంటే ఇద్దరూ జీవితాలు దుర్భరంగా మారతాయి. దీంతో ఇరు కుటుంబాలు సమస్యల మయంగా మారతాయి. కానీ ఈకాలంలో కూడా మేం చెప్పిన అబ్బాయినే నువ్వు పెళ్లి చేసుకోవాలి. లేదంటే చంపేస్తాం అనే బెదిరింపులు..ఇష్టపడిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటే వెంటాడి వేటాడి చంపేసే విష సంస్కృతి కొనసాగుతోంది. ఈక్రమంలో బంధువుల అబ్బాయినే పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టిన కుటుంబ సభ్యులకు ‘‘నేను ఆ అబ్బాయిన పెళ్లి చేసుకోను’’ అని చెప్పినందుకు ఓ యువతిని అత్యంత దారుణంగా 10మంది కలిసి చంపేసిన ఘటన సిరియాలో చోటుచేసుకుంది. సిరియాలోని అల్ హసకా గవర్నరేట్ ప్రాంతానికి చెందిన 18 ఏళ్ల యువతిని కుటుంబ సభ్యులే అత్యంత కిరాతకంగా కాల్చి చంపేశారు.

ఈడా అల్హ మౌది అల్స యీడో అనే 18 ఏళ్ల యువతిని ఆమె తండ్రి, సోదరుడు తమ బంధువుల అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నారు.కానీ ఈడా మరో అబ్బాయిని ప్రేమించింది. ‘నేను బంధువుల అబ్బాయిని పెళ్లి చేసుకోను’ అని కచ్చితంగా చెప్పేసింది. దీంతో కుటుంబ సభ్యులతో పాటు బంధువులు కూడా ఆమెపై విరుచుకుపడ్డారు. భయపెట్టారు. కానీ ఆమె ఒప్పుకోలేదు. వేరే అబ్బాయిని ప్రేమించాను అతడినే వివాహం చేసుకుంటానని చెప్పింది. దానికి వారు అతను వేరే తెగకు చెందినవాడు కాబట్టి ఈ పెళ్లికి ఒప్పుకోం..బంధువుల అబ్బాయినే వివాహం చేసుకోవాలని తెగేసి చెప్పారు.కొట్టినా వినలేదు ఈడా. ఈ క్రమంలో ఆమె ఎక్కడ ప్రేమించిన అబ్బాయితో వెళ్లిపోతే తమ పరువు పోతుందని భావించిన కుటుంబం ఆమెను హత్య చేయటానికి కూడా వెనుకాడలేదు.

అలా ఈడా తండ్రి, సోదరులతో పాటు..ఆమె బంధువులు మొత్తం 10మంది యువకులు కలిసి ఆమెను అల్-హసాకా శివార్లలోకి ఈడ్చుకెళ్లారు. అప్పుడు ఆమె తనను రక్షించమని సహాయం కోసం పెద్ద పెద్దగా కేకలు వేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు. దీంతో బాలికను ఈడ్చుకెళ్లి తలకు రైఫిల్ గురిపెట్టి కాల్చి చంపేశారు. ఆటోమేటిక్‌ రైఫిల్స్‌తో కాల్చి హత్య చేశారు. కానీ ఈ ఘటనపై తూర్పు సిరియాలో భద్రతా అధికారులు అధికారిక ప్రకటన జారీ చేయలేదు కానీ..ఈశాన్య సిరియాలోని సెంటర్‌ ఫర్‌ రీసెర్చ్‌ అండ్‌ ప్రొటెక్షన్‌ ఆఫ్‌ ఉమెన్స్‌ రైట్స్‌ భద్రతా అధికారులు ఈ నేరం జరిగినట్లుగా ధృవీకరించారు. ఈ ఘటనపై సిరియాలో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజలు రోడ్లపైకి వచ్చి దీనికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.