Russian Missiles: ఉక్రెయిన్‌పై రష్యా ప్రయోగించిన క్షిపణులు నాటో సభ్యదేశం పోలండ్‌లో పడ్డ వైనం

ఉక్రెయిన్‌పై రష్యా ప్రయోగించిన క్షిపణులు పోలండ్‌లో పడి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారని పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు పేర్కొన్నాయి. ఉక్రెయిన్‌ సరిహద్దుల్లోని పోలండ్ లోని ప్రెవొడోవ్ లో రష్యా క్షిపణులు పడ్డాయి. పోలండ్ నాటో సభ్య దేశం. దీంతో నాటో దేశాలు ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే దీనిపై నివేదిక తెప్పించుకున్నట్లు తెలుస్తోంది. పోలండ్ ప్రధాని మాథ్యూజ్ మోరావియెక్కీ తమ జాతీయ భద్రతా, రక్షణ శాఖ కమిటీతో అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు.

Russian Missiles: ఉక్రెయిన్‌పై రష్యా ప్రయోగించిన క్షిపణులు నాటో సభ్యదేశం పోలండ్‌లో పడ్డ వైనం

Missile

Russian Missiles: ఉక్రెయిన్‌పై రష్యా ప్రయోగించిన క్షిపణులు పోలండ్‌లో పడి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారని పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు పేర్కొన్నాయి. ఉక్రెయిన్‌ సరిహద్దుల్లోని పోలండ్ లోని ప్రెవొడోవ్ లో రష్యా క్షిపణులు పడ్డాయి. పోలండ్ నాటో సభ్య దేశం. దీంతో నాటో దేశాలు ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే దీనిపై నివేదిక తెప్పించుకున్నట్లు తెలుస్తోంది.

పోలండ్ ప్రధాని మాథ్యూజ్ మోరావియెక్కీ తమ జాతీయ భద్రతా, రక్షణ శాఖ కమిటీతో అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. పోలండ్ లో పడింది రష్యా క్షిపణులే అని అమెరికా ఇంటెలిజన్స్ అధికారి ఒకరు మీడియాకు చెప్పారు. అయితే, ఈ విషయాన్ని తాము ఇంకా ధ్రువీకరించలేదని పెంటగాన్ తెలిపింది.

దీనిపై శ్వేతసౌధం స్పందిస్తూ పోలండ్ లో ఇతర దేశం నుంచి వచ్చి క్షిపణులు పడ్డాయన్న విషయంపై ఇప్పటివరకు తాము ఎలాంటి నిర్ధారణకు రాలేదని, దీనిపై పూర్తి సమాచారాన్ని సేకరించడానికి పోలండ్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నామని చెప్పింది. క్షిపణులు పడిన అంశంపై పోలండ్‌ ప్రభుత్వం స్పందించలేదు.

తమ దేశ క్షిపణులు పోలండ్ భూభాగంలో పడ్డాయన్న వార్తలను రష్యా రక్షణ శాఖ ఖండించింది. రష్యా అధ్యక్షుడి కార్యాలయం దీనిపై ఇప్పటివరకు స్పందించలేదు. మరోవైపు, జీ-20 సదస్సులో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ తాజాగా మాట్లాడారు. ఆయన రష్యా చేస్తున్న దాడుల గురించి మాట్లాడడంతో ఆ వెంటనే ఉక్రెయిన్ పై రష్యా దాడులు తీవ్ర తరం చేయడం గమనార్హం.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..