1.3 KM wide asteroid : భూమి వైపుకు మరోసారి వేగంగా దూసుకొస్తున్న1.3 కిలోమీటర్ల గ్రహశకలం

2006లో భూమికి చేరువగా వచ్చి వెళ్లిన భారీ గ్రహం శకలం మరోసారి భూమివైపుకు అత్యంత వేగంగా దూసుకొస్తోంది. ఇది చాలా ప్రమాదకరమని పరిశోధకులు చెబుతున్నారు.

1.3 KM wide asteroid : భూమి వైపుకు మరోసారి వేగంగా దూసుకొస్తున్న1.3 కిలోమీటర్ల గ్రహశకలం

1.3 Km Wide Asteroid

wide asteroid (2001 CB2) headed towards Earth : అనంత విశ్వంలో కోట్లకొద్దీ గ్రహశకలాలు తిరుగుతుంటాయి. వీటిలో కొన్ని భూమివైపుకు దూసుకొస్తుంటాయి. మరికొన్ని వాటి వాటి కక్ష్యంలో తిరుగుతుంటాయి. అలా దూసుకొచ్చేవి చాలా గ్రహశకలాలు భూవాతావరణంలోకి వచ్చేసరికి మండిపోయి చిన్న చిన్న శకలాలుగా మారి కాలిపోతుంటాయి. మరికొన్ని మాత్రం భూమిమీద పడతుంటాయి. అటువంటి ఓ భారీ భారీ గ్రహశకలం ఒకటి భూమి వైపు వేగంగా దూసుకువస్తోంది. ఇది ఎంత భారీగా ఉందంటే సుమారు 1.3 కిలోమీటర్ల పరిమాణం ఉందని పరిశోధకులు చెబుతున్నారు.

Also read :  Asteroid : భూమివైపు దూసుకొస్తున్న గ్రహశకలం.. తాజ్ మహల్ కంటే 3 రెట్లు పెద్దదట!

సుమారు 1.3 కిలోమీటర్ల పరిమాణంలో ఉన్న ఈ భారీ గ్రహ శకలం (Asteroid) మార్చి 4న భూమికి సమీపానికి వస్తుందని నాసాకు చెందిన జెట్ ప్రొపల్షన్ లేబరేటరీ (JPL) ప్రకటించింది. భూమికి 49,11,298 కిలోమీటర్ల చేరువగా వచ్చి వెళుతుందని అంచనా వేస్తోంది. ప్రమాదకరమైన గ్రహశకలం అని తెలిపింది. 138971 (2001 సీబీ21) పేరుతో పిలిచే ఈ గ్రహశకలం సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తోందని జేపీఎల్ తెలిపింది. కేవలం 400 రోజుల్లోనే ఒక సారి చుట్టి వస్తోందని.. గంటకు 43,236 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తున్నట్టు వెల్లడించింది.

Also read : Alien abduction: ఏలియన్స్ నన్ను 50సార్లు కిడ్నాప్ చేశారు..

చివరిగా ఇదే గ్రహశకలం 2006లో భూమికి చేరువగా వచ్చి వెళ్లింది. అప్పుడు 71,61,250 కిలోమీటర్ల సమీపానికి వచ్చింది. అంటే ఈ సారి ఇంకొంచెం దగ్గరగా రానుందని తెలిపారు. 2022 మార్చి 4 తర్వాత.. మళ్లీ 2043లో ఇదే గ్రహశకలం భూమికి చేరువగా వస్తుందని జేపీఎల్ తెలిపింది. అప్పుడు ఇంకాస్త దగ్గరగా 48,15,55 కిలోమీటర్ల సమీపానికి వచ్చి వెళుతుందని అంచనా వేసింది. 4.6 బిలియన్ సంవత్సరాల క్రితం సౌరకుటుంబం ఏర్పడినప్పుడు మిగిలిపోయిన రాతిశకలాలనే గ్రహశకలాలుగా చెబుతారు.

Also read : War with Aliens :మూడో ప్రపంచ యుద్ధం ఏలియన్స్ తోనేనా..?!అవే మన క్షిపణుల్ని పనిచేయకుండా చేస్తున్నాయా?

Also read : Distant red stars signals : 19 నక్షత్రాల నుంచి రేడియో సిగ్నల్స్.. గ్రహాంతరవాసులు ఇచ్చిన సంకేతాలా?