Josh Fight :బోర్ కొడితే ఫైట్ చేయొచ్చు..వందలమంది కత్తులతో నరుకున్నా..ఒక్కరికీ గాయాలవ్వలేదు..

Josh Fight :బోర్ కొడితే ఫైట్ చేయొచ్చు..వందలమంది కత్తులతో నరుకున్నా..ఒక్కరికీ గాయాలవ్వలేదు..

Josh Fight (2)

Josh Fight 2021 : అదొక యుద్ధం. వందలాదిమంది కలిసి ఇష్టమొచ్చినట్లుగా కొట్టుకున్నారు. అయినా ఒక్కరంటే ఒక్కరికి కూడా గాయలవ్వలేదు. ఇదేం చిత్రం..?! అనిపిస్తుంది కదూ. కొట్టుకోవటమంటే కోపంతో కొట్టుకుంటారు. కసితో కొట్టుకుంటారు. ఎదుటివాడికి చంపేయాలన్నంత కోపంతో రగిలిపోతూ కొట్టుకుంటారు.కానీ జోష్ తో కొట్టుకునేవాళ్ల వీడియో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యింది. ఈ జోష్ వీడియో జనాలకు ఎంతగా నచ్చిందంటే..ఏకంగా 1.1 కోట్ల మంది చూసేంత నచ్చేసింది..ఈ వీడియోను ఇంకా ఇంకా చూస్తూనే ఉన్నారు. అంతలా సంతోషం కలిగించేూ ఈ జోష్ వీడియో విశేషాలు..

జోష్ ఫైట్. ఇదొక యుద్ధం. అంటే నిజమైన యుద్ధం కాదు. జోష్ వార్ అన్నమాట. ఈ యుద్ధంలో పాల్గొనే సైనికుల పేర్లు జోష్ (Josh). అంటే ఉత్సాహం అని అర్థం అనే విషయం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ జోష్ సైనికులంతా…నెబ్రాస్కాకు చేరుకున్నారు. అంతే కత్తులతో ఇష్టమొచ్చినట్లు కొట్టేసుకున్నారు.US నెబ్రాస్కాలోని లింకన్ అనే పట్టణంలో జరిగే జోష్ ఫైట్‌లో పాల్గొన్నారు. ఉల్లాసంగా, ఉత్సాహంగా పిచ్చ పిచ్చగా కొట్టేసుకున్నారు. అయినా ఒక్కరంటే ఒక్కరికి కూడా గాయాలు కాకపోవటం ఈ జోష్ ఫైట్ స్పెషాలిటీ..

ఈ యుద్ధంలో అన్ని వయసులవారూ పాల్గొనవచ్చు. లైఫ్ బోర్ కొట్టిన వాళ్లు… చిరాకొచ్చినా ఈ యుద్ధంలో పాల్గొనవచ్చు. ఈ జోష్ యుద్ధంలో పాల్గొన్న ప్రతీ ఒక్కరికీ బొమ్మ కత్తులు ఇస్తారు. వాటితో దొరికిన వాళ్లను దొరికినట్లు నరికేయవచ్చు. కానీ ఎవ్వరికీ చిన్న గాయం కూడా అవ్వదు. తమలోని కసి, కోపం, క్రోధం, పగ, ప్రతీకారం ఇలా ఏం ఉన్నా తీర్చేసుకోవచ్చు. కానీ ఎవ్వరికీ గాయాలు అవ్వవు. ఈ జోష్ ఫైట్ స్పెషాలిటీ ఏమంటే..మనంకోపం తీరిపోతుంది..ఎవ్వరికీ దెబ్బలు తగలవు. భలే ఉంది కదూ..ఈ జోష్ ఫైట్ కాన్సెప్ట్..

ఇంతకీ ఈ యుద్ధం ఎలా మొదలైందో తెలుసుకోవాల్సిందేనండోయ్..అరిజోనాకు చెందిన జోష్ స్వైన్ అనే ఓ కాలేజీ కుర్రాడు ఫేస్‌బుక్‌లో తనతో జోష్ ఫైట్ చెయ్యమని ఛాలెంజ్ విసిరాడు. అలా జోష్ గ్రూప్ స్టార్ట్ అయ్యింది. అలా గ్రూప్ లో వాళ్లంతా అందరం కలిసి ఎక్కడ కొట్టుకుందాం? ఎలా కొట్టుకుందాం అని చర్చించుకుని పక్కగా ప్లాన్ వేసుకున్నారు. అలా నెబ్రాస్కాలోని లింకన్ సిటీని సెలక్ట్ చేసుకున్నారు. ఆ యుద్ధానికి ‘‘నిజమైన ఉత్సాహం’’ అని పేరు కూడా పెట్టారు.రండి అందరం కొట్టేసుకుందాం..అని పిలుపు ఇచ్చారు. అలా మొదలైన ఈ ‘జోష్ ఫైట్’ వేరు వేరు ప్రాంతాల్లో జరుపుకుంటుంటారు. సంవత్సరం నుంచి వేర్వేరు ప్రాంతాల్లో చాలా మంది జోష్ ఫైట్ జరుపుకుంటున్నారు. ట్విట్టర్‌లో జోష్ ఫైట్ హ్యాష్ ట్యాగ్ కొడితే…చాలు కుప్పలు తెప్పలుగా ఈ జోష్ ఫైట్ లు చాలానే వస్తాయి.

మొదట్లో ఈ యుద్ధంలో పేపర్ తో కొట్టుకునేవారు. తరువాత పేపర్లతో రాళ్లను తయారు చేసేవారు. ఆ తరువాత బొమ్మ కత్తులతో కొట్టుకోవటం మొదలైంది. క్రమంగా చాలా డెవలప్ అయ్యి అయ్యూ అదొక లేటెస్ట్ ట్రెండ్ గా మారింది. జోష్ సైనికులు స్పైడర్ మేన్లు, బ్యాట్‌మేన్లలాగా కాస్ట్యూమ్స్‌లో వస్తు.. ఈ జోష్ ఫైట్ ను మరింత జోష్ గా మార్చేస్తున్నారు. నెబ్రాస్కా ఈ జోష్ ఫైట్ లో ఐదేళ్ల చిన్నారిని విజేతగా ప్రకటించారు. అతనికి బర్గర్ కింగ్ కిరీటం తొడిగారు. వినటానికి ఇదంతా సిల్లీగా అనిపించొచ్చు. కానీ దీంట్లో పాల్గొన్న వారు మాత్రం రిలాక్స్ ఫీల్ అవుతున్నారు. కరోనాతో రోటీన్ లైఫ్ బోర్ కొడుతోందనీ…పైగా ఒత్తిడికి గురవుతున్నవాళ్లకు ఈ జోష్ ఫైట్ బాగా ఉపయోగపడుతోందని ప్రష్టేషన్ అంతా ఈ ఫైట్ లో తీర్చేసుకోవచ్చని అంటున్నారు. భలే బాగుంది కదూ ఈ జోష్ ఫైట్..