FLying Car : విమానంలా గాల్లో ఎగురుతున్న కార్లు..సక్సెస్ ఫుల్ గా ట్రయల్ రన్

విమానాలు గాల్లో ఎగటం చూశాం. హెలికాఫ్టర్లను కూడా చూశాం. కానీ కారు గాల్లో ఎగరటం ఎక్కడన్నా చూశామా? కారు గాల్లో ఎగరటం సినిమాల్లో చూశాం. కానీ నిజంగానే కార్లు గాల్లో విమానంలా ఎగురుతున్నాయి. ఇదంతా టెక్నాలజీ చేసిన అద్భుతం.

FLying Car : విమానంలా గాల్లో ఎగురుతున్న కార్లు..సక్సెస్ ఫుల్ గా ట్రయల్ రన్

Flying Car

FLying CAR : మో గుర్రం ఎగరావచ్చు అనే మాట విన్నాం. కానీ గుర్రం ఎగరటం సినిమాల్లో మాత్రమే చూస్తాం. కానీ మనిషి తలచుకుంటే నేలమీద నడిచేదాన్ని గాల్లో ఎగిరేలా చేయగలడు. గాల్ల ఎగిరేదాన్ని నేల మీద కూడా నడిచేలా చేయగలడు. ఈ టెక్నాలజీ యుగంలో ఏదైనా సాధ్యమేనంటున్నాడు మనిషి. అటువంటిదే గాల్లో ఎగిరే కాదు. గాల్లో విమానాలు ఎగురుతాయి గానీ కార్లు ఎగురుతాయా? అనే డౌట్ ఈ టెక్నాలజీ రోజుల్లో రాకూడదు. కార్లు గాల్లో ఎగరటం..పడవల్లా మారిపోవటం వంటి సీన్లు జేమ్స్ బాండ్ సినిమాల్లో చూశాం. కానీ అది సినిమా టెక్నిక్ కాదు..నిజంగానే గాల్లో ఎగిరే కార్లు వచ్చేస్తున్నాయ్..!! ఆల్రెడీ వచ్చేసింది కూడా..ట్రయల్ రన్ ని కూడా సక్సెస్ ఫుల్ గా పూర్తిచేసుకున్నాయి. ఫ్యూచర్ అంతా ఇలా గాల్లో ఎగిరే కార్లదే కానుందంటున్నారు టెక్నాలజీ నిపుణులు.

భూమ్మీద వెళ్తూ వెళ్తూ ఉన్నట్లుండి ఒక్కసారిగా గాల్లో ఎగిరే ప్రోటోటైప్ ఫ్లయింగ్ కారును ఈ మధ్యే రెడీ చేశారు. టెస్ట్ డ్రైవ్ కూడా సక్సెస్ ఫుల్ గా పూర్తి చేశారు. స్లోవేకియాలోని నిత్రా, బ్రాతిస్లావా అంతర్జాతీయ విమానాశ్రయాల మధ్య ఈ ఎయిర్ కారును 35నిమిషాల పాటు ఎగరేశారు. రెండున్నర నిమిషాల్లోపే కారు విమానంగా మారిపోవడం చూసి జనాలు నోరెళ్లబెడుతున్నారు. ఈ హైబ్రిడ్ కార్ ఎయిర్ క్రాఫ్ట్‌కు.. బీఎండబ్ల్యూ ఇంజిన్‌ను అమర్చి, రెగ్యులర్‌గా వాడే పెట్రోల్‌నే ఇంధనంగా వాడారు. ఈ కారు విమానంగా మారి గాల్లో ఎగరటానికి 2 నిమిషాల 15 సెకన్ల టైమ్ పట్టింది. సుమారు 8వేల 2వందల అడుగుల ఎత్తులో… వెయ్యి కిలోమీటర్ల వరకు ఈ ఫ్లయింగ్ కారు ప్రయాణిస్తుంది. అంతేకాకుండా 40గంటల వరకు గాలిలో ఉండే సామర్థ్యాన్ని ఇది కలిగి ఉందని ఈకారును తయారు చేసినవారు చెబుతున్నారు.

ఇది రోడ్డుపై ప్రయాణించేటప్పుడు కారులాగే ఉంటుంది. కానీ సడెన్ గా రెక్కలు విచ్చుకుంటాయి. అలా అచ్చంగా విమానం లాగా పైకి ఎగరుతుంది. ఇది కారా?విమానమా? అనే డౌట్ వచ్చేస్తుంది. కారుకు రెండువైపులా వెడల్పాటి రెక్కలు విచ్చుకుంటాయి. అలా కారు విమానంలా మారి రన్‌వే నుంచి నేరుగా నగరంలోకి తీసుకువచ్చారు. అంతే దాన్ని చూసి అందరూ నోరెళ్లబెట్టారు. అందరి దృష్టి ఈ ఫ్లయింగ్ కారుపై మీదనే ఉంది. ఈ ప్లైయింగ్ కారు ఇద్దరు వ్యక్తులతో పాటు 200ల కేజీల వరకు బరువును మోయగలదు. ఎయిర్ కార్ అనేది భవిష్యత్‌లో భాగంగా కాబోతోందని మెకానికల్ ఎక్స్‌పర్ట్స్ చెప్తున్నారు.

ప్రస్తుతం రవాణా సదుపాయాలపై ఉన్న ఒత్తిడిని తగ్గించేందుకు ఈ ఆవిష్కరణ… ఓ సరికొత్త పరిష్కారంగా మారే అవకాశం ఉంది. ప్రొటోటైప్‌ ఎయిర్‌కార్ అభివృద్ధి చేయడానికి రెండేళ్ల సమయం పట్టిందని దానిని తయారు చేసిన క్లీన్‌ విజన్‌ సంస్థ తెలిపింది. పెట్టుబడి రెండు మిలియన్‌ యూరోల కన్నా తక్కువే అయిందట. గ్లోబల్‌ ఎయిర్‌లైన్‌ లేదా ట్యాక్సీల అమ్మకాల్లో కొద్దిశాతం వాటాను సాధించినా అది తమకు భారీ విజయం అవుతుందని సంస్థ నిర్వాహకులు అంటున్నారు. అమెరికాలో దాదాపు 40వేల విమానాలకు ఆర్డర్లు ఉన్నాయని.. వీటిలో 5శాతం ఎయిర్‌‌కారులవైపు మొగ్గు చూపినా తమది పెద్ద మార్కెట్‌ అవుతుందని చెప్తున్నారు. మొత్తానికి ఫ్లైయింగ్ కార్ల జోరు పెరిగింది. చాలా కంపెనీలు పోటీపడి మరీ… సరికొత్త ఎగిరే కార్లు తయారుచేస్తున్నారు. ఇక ప్రపంచ దేశాలు పర్మిషన్ ఇవ్వడమే మిగిలి ఉందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్.