Elnaz Rekabi: ఇరాన్ క్రీడాకారిణి రెకాబీకి స్వదేశంలో ఘనస్వాగతం.. అరెస్టుకు రంగం సిద్ధం! అసలేం జరిగిందంటే?

రెకాబీ చేసిన పనికి ఇరాన్ ప్రభుత్వం సీరియస్ అయింది. వెంటనే ఆమెను స్వదేశానికి తిరిగిరావాలని ఆదేశించింది. ఆమె ఇరాన్ తిరిగిరాగానే అరెస్టు చేస్తారని, ఆ మేరకు రంగం సిద్ధమైందని అక్కడ మీడియా పేర్కొంది. ఇలాంటి సమయంలో బుధవారం తెల్లవారు జామున టెహ్రాన్‌కు తిరిగి వచ్చిన మహిళకు ఊహించని విధంగా స్థానిక ప్రజలు స్వాగతం పలికారు.

Elnaz Rekabi: ఇరాన్ క్రీడాకారిణి రెకాబీకి స్వదేశంలో ఘనస్వాగతం.. అరెస్టుకు రంగం సిద్ధం! అసలేం జరిగిందంటే?

Elnaz Rekabi

Elnaz Rekabi: ఇరాన్‌లో దేశవ్యాప్తంగా హిజాబ్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం హెచ్చరికలను బేఖాతర్ చేస్తూ వేలమంది ఇరాన్ మహిళలు ప్రాణాలకు తెగించి నిరసనల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో అంతర్జాతీయ క్రీడా పోటీల్లో ఇరాన్‌కు చెందిన ఎల్నాజ్ రెకాబీ(33) హీజాబ్ లేకుండా పాల్గొంది. ఇరాన్ నిబంధనల ప్రకారం.. ఆ దేశ క్రీడాకారిణులు తప్పనిసరిగా హిజాబ్ ధరించాలి. కానీ రెకాబీ క్రీడా పోటీల్లో పాల్గొంటున్న సమయంలో హిజాబ్ ధరించలేదు. దీంతో ఇరాన్ లో జరుగుతోన్న హిజాబ్ వ్యతిరేఖ ఆందోళనకు మద్దతుగానే అలా చేసిందనే కోణంలో అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. హిజాబ్ అనుకోకుండా పడిపోయిందని, నేను కావాలని దానిని తొలగించలేదని ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది.

BCCI vs PCB: బీసీసీఐ నిర్ణయం పట్ల ఘాటుగా స్పందించిన పీసీబీ.. అఫ్రీది రియాక్షన్ ఏమిటంటే?

రెకాబీ చేసిన పనికి ఇరాన్ ప్రభుత్వం సీరియస్ అయింది. వెంటనే ఆమెను స్వదేశానికి తిరిగిరావాలని ఆదేశించింది. ఆమె ఇరాన్ తిరిగిరాగానే అరెస్టు చేస్తారని, ఆ మేరకు రంగం సిద్ధమైందని అక్కడ మీడియా పేర్కొంది. ఇలాంటి సమయంలో హిజాబ్ లేకుండా అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొని ప్రపంచ వ్యాప్తంగా వార్తల్లో నిలిచిన ఎల్నాజ్ రెకాబీ బుధవారం తెల్లవారు జామున టెహ్రాన్‌కు తిరిగి వచ్చింది. అయితే, ఎవరూ ఊహించని విధంగా ఆమెకు స్థానిక ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. వేలాది మంది ప్రజలు బుధవారం తెల్లవారు జామున ఆమెకు ఘనస్వాగతం పలికేందుకు బారులు తీరారు. టెహ్రాన్‌కు తిరిగి వచ్చిన తర్వాత ఆమెపై విచారణ జరుగుతుందనే భయాల మధ్య ప్రజలు మద్దతుగా నిలవడం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియోల్లో రేకాబీని విమానాశ్రయం నుంచి టాక్సీలో వెళ్లినట్లు ఉంది. సెక్యూరిటీ గార్డులు ఆమెను ఎక్కడికి తీసుకెళ్తున్నారో సమాచారం లేదు. అయితే, హిజాబ్ ధరించనందుకు ఆమెను ఇబ్బందులకు గురిచేస్తే అది ఖచ్చితంగా ఇరానియన్లలో భారీ కోపాన్ని సృష్టిస్తుందని, అంతర్జాతీయ మద్దతు ఆమెకు సహాయపడుతుందని నేను ఆశిస్తున్నానంటూ ఇరాన్ జర్నలిస్ట్, సామాజిక కార్యకర్త ఒకరు పేర్కొన్నారు.