ఐ ఫోన్ కోసం కిడ్ని అమ్ముకున్న యువకుడు..తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రి పాలు

10TV Telugu News

young man selling kidney : ఐ ఫోన్ పిచ్చి ఓ యువకుడి ప్రాణాల మీదికి తెచ్చింది. యాపిల్ ఐ ఫోన్ కోసం కిడ్ని అమ్మిన ఓ యువకుడు ఇప్పుడు ఆస్పత్రి పాలయ్యాడు. చైనాకు చెందిన 17 ఏళ్ల వాంగ్ యాపిల్ ఫోన్ అంటే పిచ్చి. ఐ ఫోన్ కొనేందుకు తన దగ్గర అంత మొత్తంలో డబ్బు లేకపోవడంతో తన కిడ్ని అమ్మి ఫోన్ కొన్నాడు.https://10tv.in/bill-gates-says-more-than-50-of-business-travel-will-disappear-in-post-coronavirus-world/
ఇది 2011లో జరిగింది. కానీ కొంతకాలానికే అతని మరో కిడ్నీకి సమస్య ఏర్పడింది. ఇప్పుడది పెద్దది అవ్వడంతో అతని పరిస్థితి మరింత ధీనంగా తయారైంది. అవయాలు సక్రమంగా పనిచేయకపోవడంతో ఆస్పత్రి పాలయ్యాడు.అతనికి తరచూ డయాలసిస్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక జీవితాంతం అతడు బెడ్ కే పరిమితం కావాలని వైద్యులు చెప్పారు.

×