Packed Military Plane : మిలటరీ విమానంలో ఇరుక్కుని కూర్చుని దేశం విడిచిన ఆఫ్ఘన్లు

తాలిబన్ల ఆక్రమణ కారణంగా ఆఫ్ఘనిస్తాన్ నుంచి బయట పడేందుకు అక్కడి ప్రజలు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.

Packed Military Plane : మిలటరీ విమానంలో ఇరుక్కుని కూర్చుని దేశం విడిచిన ఆఫ్ఘన్లు

Us Air Force Flight

Packed US Military Plane :  తాలిబన్ల ఆక్రమణ కారణంగా ఆఫ్ఘనిస్తాన్ నుంచి బయట పడేందుకు అక్కడి ప్రజలు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. 640 మందితో కిక్కిరిసిన యునైటెడ్ స్టేట్స్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన విమానం ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. యూఎస్, దాని మిత్రదేశాల ద్వారా రవాణా చేయబడుతున్న అతి పెద్ద సైనిక సరుకు రవాణా విమానాల్లో ఒకటైన సీ-17 ద్వారా ఎక్కువ మంది ప్రజలు  ప్రయాణించిన విమానాల్లో ఇది ఒకటి. ఆఫోటో మన భారతదేశంలోని   రిజర్వేషన్ లేని జనరల్ రైలు బోగీని తలపించింది.

దాదాపు రెండు దశాబ్దాల తర్వాత దేశంలో తాలిబన్లు తిరిగి అధికారంలోకి రావటంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. విమానంలో ఎక్కువ మందిని తీసుకు వెళ్లే అవకాశం లేదని రక్షణ అధికారులు చెప్పారు. అయితే భయాందోళనలకు గురైన అక్కడి ప్రజలు ఆఫ్ఘన్ విడిచిపెట్టి పారిపోవటానికి విమానంలోని ఓపెనె ర్యాంప్ లోకి దూసుకు వెళ్లారు. దిగమని చెప్పలేని యూఎస్ రక్షణ సిబ్బంది వారిని ఖతార్ తీసుకువెళ్లాలని నిర్ణయించుకున్నారు.

పెద్ద ఎత్తున ప్రజలు తరలి రావటంతో కాబూల్ విమానాశ్రయం జనసంద్రంగా మారింది. విమానాశ్రయం బయట, లోపల విమానాల వద్ద పెద్ద ఎత్తున ప్రజలు గూమి కూడారు. ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల నియంత్రణలోకి వచ్చిన తర్వాత ప్రజలు దేశం విడిచి పారిపోవటానికి ప్రయత్నిస్తుండగా మరోవైపు కాబూల్ విమానాశ్రయంలో గందరగోళ పరిస్ధితులు కనిపించాయి.  దేశం విడిచి పారిపోవాలనే ఉద్దేశ్యంతో ఇద్దరు ఆఫ్ఘనిస్తానీయులు విమానం చక్రాలకు తమను తాము కట్టుకుని ప్రయాణించారు. విమానం టేకాఫ్ అవగానే వారు పైనుంచి కిందపడి మరణించారు.

సోమవారం బయలు దేరిన యూఎస్ మిలటరీ జెట్ విమానంవైపు కొందరు దాన్ని అంటిపెట్టుకుని ఉండిపోయారు. కాబూల్ విమానాశ్రయంలో టేకాఫ్ తీసుకుంటున్న యూఎస్ వైమానిక దళం యోక్క భారీ విమానం వెంట అనేక మంది ప్రజలు పరుగులు పెట్టారు. యూఎస్ మిలటరీ విమానాలు ప్రజలను తరలించేందుకు విమానాలను నిలపగా…ప్రాణాలను సైతం పణంగా పెట్టి అవి ఎక్కేందుకు ప్రజలు సిధ్ధపడ్డారు. విమానాశ్రయంలో ఎటు చూసినా గందరగోళ పరిస్ధితులు కనపడ్డాయి.  ఒక విమానాన్ని టేకాఫ్ చేయటానికి దాని ముందు మరోక హెలికాప్టర్  ప్రజలను తరిమి కొట్టటానికి ఉపయోగించారంటే అక్కడి ప్రజలు దేశం విడిచిపారిపోవటానికి ఎంతలా ప్రయత్నిస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు.