World Bank : అప్ఘానిస్తాన్‌కు నిధులు నిలిపేసిన ప్రపంచ బ్యాంకు

అప్ఘానిస్తాన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అప్ఘాన్‌కు ప్రపంచ బ్యాంకు నిధుల సరఫరాను నిలిపివేసింది. అప్ఘాన్ తాలిబన్ల చెరలోకి వెళ్లడంతో అక్కడి ఆర్థిక పరిస్థితిపై తీవ్రప్రభావం పడింది.

World Bank : అప్ఘానిస్తాన్‌కు నిధులు నిలిపేసిన ప్రపంచ బ్యాంకు

Afghanistan World Bank Halts Aid After Taliban Takeover

World Bank halts aid to Afghanistan : అప్ఘానిస్తాన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అప్ఘాన్‌కు ప్రపంచ బ్యాంకు నిధుల సరఫరాను నిలిపివేసింది. అప్ఘాన్ తాలిబన్ల చెరలోకి వెళ్లడంతో అక్కడి ఆర్థిక పరిస్థితిపై తీవ్రప్రభావం పడింది. అప్ఘాన్ రిజర్వులను అమెరికా బైడెన్ ప్రభుత్వం స్తంభింపజేసింది.. ఇప్పుడు అక్కడి ప్రాజెక్టులకు సంబంధించి నిధుల సరఫరాను ప్రపంచ బ్యాంకు నిలిపివేస్తున్నట్టు వెల్లడించింది. తాలిబన్లు అధికారంలోకి వస్తే.. అప్ఘాన్ అభివృద్ధి భవిష్యత్తుతో పాటు ప్రత్యేకించి మహిళల హక్కులపై తీవ్ర ప్రభావం పడనుంది. అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) అప్ఘా‌న్‌కు చెల్లింపులు నిలిపివేసిన కొన్నిరోజుల్లోనే ప్రపంచ బ్యాంకు ఈ దిశగా నిర్ణయం తీసుకుంది.

అప్ఘానిస్తాన్‌లో ప్రాజెక్టులకు చెల్లింపులను నిలివేశామని ప్రపంచ బ్యాంకు తెలిపింది. అప్ఘాన్ పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని తెలిపింది. భాగస్వాములతో కలిసి సరైన మార్గాన్ని అన్వేషిస్తున్నామని, అప్ఘా‌‌న్ ప్రజలకు తమ మద్దతు కొనసాగుతూనే ఉంటుందని ప్రపంచ బ్యాంకు ప్రతినిధి తెలిపారు. 2002 నుంచి వాషింగ్టన్ ఆధారిత ఆర్థిక సంస్థ అఫ్ఘానిస్తాన్‌లో పునర్నిర్మాణం, అభివృద్ధి ప్రాజెక్టులకు 5.3బిలియన్ల కంటే ఎక్కువగా ఖర్చు చేసింది. పలు అభివృద్ధి కార్యక్రమాలను విజయవంతంగా ప్రపంచ బ్యాంకు నిర్వహించింది. తాలిబన్ల ఆక్రమణ తర్వాత ప్రాజెక్టు పనులన్నీ ఎక్కడి అక్కడే నిలిచిపోయాయి.
India e-Visa: అప్ఘాన్ నుంచి భారత్‌కు వ‌చ్చే అంద‌రికీ ఈ-వీసా త‌ప్ప‌నిస‌రి

ప్రపంచ బ్యాంక్ కాబూల్ ఆధారిత బృందం, వారి సమీప కుటుంబాలను అఫ్ఘానిస్తాన్ నుంచి పాకిస్తాన్‌కు సురక్షితంగా తరలించినట్లు తెలిపింది. అఫ్ఘానిస్తాన్ చెల్లింపులను నిలిపివేయాలని ప్రపంచ బ్యాంకు తీసుకున్న నిర్ణయంతో తాలిబన్ కొత్త ప్రభుత్వాన్ని ఆర్థిక దెబ్బతీయనుంది. అఫ్ఘానిస్తాన్ ఇకపై ప్రపంచ రుణదాత వనరులను వినియోగించుకోలేదని IMF గత వారమే ప్రకటించింది. అంతేకాదు.. అఫ్ఘానిస్తాన్‌లో ప్రభుత్వాన్ని గుర్తించే విషయంలో అంతర్జాతీయంగా స్పష్టత లేదని IMF ప్రతినిధి ఒకరు చెప్పారు.

ఆగష్టు 23 నుంచి దేశానికి దాదాపు 440 మిలియన్ల డాలర్లు కొత్త ద్రవ్య మానటరీ రిజర్వులు అందుబాటులోకి రానున్నాయి. తాలిబాన్లు కాబూల్‌ని తమ ఆధీనంలోకి తీసుకున్న కొన్ని రోజుల తర్వాత.. అఫ్ఘానిస్తాన్ సెంట్రల్ బ్యాంక్ అమెరికాలో ఉన్న ఏవైనా ఆస్తులు తాలిబాన్లకు అందుబాటులో ఉండవని వైట్ హౌస్ స్పష్టం చేసింది. అఫ్ఘానిస్తాన్ బ్యాంక్‌లో సుమారు 9 బిలియన్ డాలర్ల నిల్వలు ఉన్నాయి. ఇందులో ఎక్కువ భాగం అమెరికాలోనే ఉన్నాయి.