Imran Khan: భారత్‌ను పొగడ్తలతో ముంచెత్తిన పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్.. అసలు విషయం ఏమిటంటే..

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భారత్ దేశాన్ని పొగడ్తలతో ముంచెత్తారు. పాక్ ప్రధానిగా కొనసాగినన్ని రోజులు భారత్ పై కయ్యానికి కాలుదువ్విన ఆయన .. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. గత పదిరోజుల క్రితం భారత్ విదేశాంగ శాఖ పనితీరు అద్భుతమని పొగిడిన ఇమ్రాన్.. తాజాగా మోదీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవటం పట్ల స్పందించారు...

Imran Khan: భారత్‌ను పొగడ్తలతో ముంచెత్తిన పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్.. అసలు విషయం ఏమిటంటే..

Imran Khan's speeches

Imran Khan: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భారత్ దేశాన్ని పొగడ్తలతో ముంచెత్తారు. పాక్ ప్రధానిగా కొనసాగినన్ని రోజులు భారత్ పై కయ్యానికి కాలుదువ్విన ఆయన .. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. గత పదిరోజుల క్రితం భారత్ విదేశాంగ శాఖ పనితీరు అద్భుతమని పొగిడిన ఇమ్రాన్.. తాజాగా మోదీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవటం పట్ల స్పందించారు.

అమెరికా ఒత్తిడిని సైతం సమర్థంగా ఎదుర్కొని భారత్ రష్యా నుంచి తక్కువ ధరకు చమురు కొనుగోలు చేసిందన్నారు. క్వాడ్ కూటమిలో ఉన్నప్పటికీ భారత్ తమ ప్రజలకు ఉపశమనం కల్పించడం కోసమే అలా చేసిందని వివరించారు. భారత్ కు స్వతంత్ర విదేశాంగ విధానం ఉండటం వల్లే అది సాధ్యమైందని ఇమ్రాన్ తన ట్విటర్ లో ప్రస్తావించారు. అంతేకాక భారత్ లో పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపునకు సంబంధించిన మీడియా కథనాన్నిసైతం ఇమ్రాన్ తన ట్విట్ లో జోడించారు.

Pakistan To Adilabad Explosives : పాకిస్తాన్ నుంచి ఆదిలాబాద్‌కు ఆయుధాలు, పేలుడు పదార్ధాలు.. విచారణ వేగవంతం

పనిలో పనిగా ఇమ్రాన్ ఖాన్ తన ప్రస్తావనను కూడా తీసుకొచ్చారు. తాను అధికారంలో ఉండగా తమ ప్రభుత్వం కూడా ప్రత్యేక విదేశాంగ విధానం కోసం కృషిచేసిందన్నారు. స్థానిక మీర్ జాఫర్లు, మీర్ సాదిక్ లు విదేశీ శక్తులకు తలొగ్గి అధికార మార్పిడికి కారణమయ్యారని పరోక్షంగా ప్రస్తుత పాక్ ప్రధాని షెహబాఖ్ షరీఫ్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఫలితంగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో తలాతోక లేని ప్రభుత్వాన్ని నడుపుతున్నారని విమర్శించారు.