Airstrike: వైమానిక దాడిలో 51మంది మృతి.. 100మందికి గాయాలు

ఇథియోపియాలోని టైగ్రేకు ఉత్తరాన ఉన్న తోగోగా గ్రామంలో బిజీ మార్కెట్లో వైమానిక దాడి జరగగా 51మంది మరణించారు. అయితే, వైద్యులను అక్కడికి వెళ్లడానికి సైనికులు అనుమతించలేదని ఆరోగ్య కార్యకర్తలు చెప్పారు.

Airstrike: వైమానిక దాడిలో 51మంది మృతి.. 100మందికి గాయాలు

Ethiopia’s Tigray: ఇథియోపియాలోని టైగ్రేకు ఉత్తరాన ఉన్న తోగోగా గ్రామంలో బిజీ మార్కెట్లో వైమానిక దాడి జరగగా 51మంది మరణించారు. అయితే, వైద్యులను అక్కడికి వెళ్లడానికి సైనికులు అనుమతించలేదని ఆరోగ్య కార్యకర్తలు చెప్పారు.

ఈ దాడిలో 100మందికి పైగా గాయపడినట్లు అజ్ఞాత పరిస్థితిపై టైగ్రే హెల్త్ బ్యూరోకు చెందిన ఒక అధికారి అసోసియేటెడ్ ప్రెస్‌తో చెప్పారు. అందులో 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఇవే కాకుండా 33మంది తప్పిపోయినట్లు చెబుతున్నారు.

టోగోగాలో వైమానిక దాడులు నవంబర్‌లో వివాదం ప్రారంభమైనప్పటి నుండి జరుగుతున్నాయి. ఈ ప్రాంతంలో తీవ్ర పోరాటాల మధ్య ఇటువంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. దీనిపై, ఒక ఆర్మీ ప్రతినిధి మరియు ఇథియోపియన్ ప్రధానమంత్రి ప్రతినిధిని కామెంట్ చేయమని అభ్యర్థించినా స్పందించలేదు.

అదే సమయంలో, దాడిలో గాయపడిన కొంతమంది మేకెలెలోని ఐడర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. టోగోగా మార్కెట్లో విమానం నుంచి బాంబు వేసినట్లు గాయపడిన రోగులు ఆరోగ్య కార్యకర్తలకు చెప్పారు. గాయపడినవారిలో రెండేళ్ల వయస్సు వారు, ఆరేళ్ల వయస్సు వారు కూడా ఉన్నారు.

ఇథియోపియా సైనికులకు, టిగ్రే పీపుల్స్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌(టీపీఎల్‌ఎఫ్‌) తిరుగుబాటు దళాలకు మధ్య దాడులు నిరంతరం సాగుతున్నాయి. ఈ క్రమంలోనే వైమానిక దాడి జరిగినట్లు చెబుతున్నారు. అధికారికంగా ఇప్పుడు 51మంది చనిపోయినట్లు చెబుతున్నా కూడా స్థానికంగా ఉన్న ఆరోగ్య కార్యకర్తల వివరాల ప్రకారం సుమారు 80మందికిపైగా చనిపోయి ఉండవచ్చునని అంటున్నారు.