Al-Zawahiri: అల్‌ఖైదా చీఫ్ అల్-జవహరీ హతం.. మట్టుపెట్టిన అమెరికా

ఆల్‌ఖైదా చీఫ్ ఆల్-జవహరీ హతమయ్యాడు. ఆఫ్గానిస్థాన్ రాజధాని కాబుల్ లో అమెరికా జరిపిన డ్రోన్ దాడిలో అల్-జవహరి మరణించాడు. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ధృవీకరించారు.

Al-Zawahiri: అల్‌ఖైదా చీఫ్ అల్-జవహరీ హతం.. మట్టుపెట్టిన అమెరికా

Al-Zawahiri: అల్‌ఖైదా చీఫ్ ఆల్-జవహరీ హతమయ్యాడు. ఆఫ్గానిస్థాన్ రాజధాని కాబుల్ లో అమెరికా జరిపిన డ్రోన్ దాడిలో అల్-జవహరి మరణించాడు. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ధృవీకరించారు. చివరికి న్యాయం జరిగింది అని ప్రకటించారు. ఆల్-జవహరీ 9/11 తీవ్రవాద దాడుల ప్రణాళికలో పాల్గొన్నాడని జో బిడెన్ నొక్కి చెప్పారు. అమెరికన్ పౌరులు, దౌత్యవేత్తలు అల్- జవహరి లక్ష్యంగా చేసుకున్నారని బిడెన్ అన్నారు. ఎంత కాలం పట్టినా.. ఎక్కడ దాక్కున్నా.. మా ప్రజలకు ముప్పు వాటిల్లితే.. అమెరికా కనిపెట్టి చర్యలు తీసుకుంటుందని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ పేర్కొన్నారు. ఆదివారం జరిగిన ఆపరేషన్ లో పౌరులెవరూ గాయపడలేదని బిడెన్ అన్నారు.

Gulf Problems : విదేశాల్లో ఉద్యోగం, లక్షల్లో జీతం..కట్ చేస్తే ఘరానా మోసం… దుబాయ్‌లో చిక్కుకున్న మనీశా

ఇదిలాఉంటే కాబుల్ లోని షేర్పూర్ ప్రాంతంలోని ఓ నివాసంపై వైమానిక దాడి జరిగినట్లు తాలిబన్ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ ట్వీట్ చేశారు. ఈ దాడిని అంతర్జాతీయ నిబంధనల ఉల్లంఘనగా ఆయన అభివర్ణిస్తూ తీవ్రంగా ఖండించారు. దీంతో ఆల్ ఖైదా చీఫ్ అల్- జవహరీ హతమైనట్లు వస్తున్న వార్తలకు బలం చేకూరినట్లయింది.

Chikoti Praveen ED : క్యాసినో కాట్రాజ్.. 10గంటల పాటు చీకోటి ప్రవీణ్ ఈడీ విచారణ.. ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి

ఈజిప్టు సర్జన్ అయిన ఆల్ -జవహరీ ప్రపంచంలోని మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల్లో ఒకరిగా మారాడు. అమెరికా దళాలు 2011 లో ఒసామా బిన్ లాడెన్ ను హతమార్చిన తరువాత అల్ ఖైదా పగ్గాలను జవహరీ స్వీకరించాడు. జవహరీ తలపై 25 మిలియన్ డాలర్ల రివార్డును యూఎస్ ప్రకటించింది. 2011 సెప్టెంబర్ 11న అమెరికాపై జరిపిన ఉగ్రదాడుల్లో 3వేల మంది మరణించారు. ఈ దాడికి పాల్పడిన సూత్రదారుల్లో ఒకరిగా అల్ జవహరీని అమెరికా గుర్తించింది. అప్పటి నుంచి జవహరీని హతమార్చేందుకు అమెరికా ఎదురుచూస్తుంది. తాజాగా ఆప్ఘనిస్థాన్ లో జరిపిన దాడుల్లో అల్ జవహరీ ని మట్టుబెట్టినట్లు అమెరికా తెలిపింది.