UNESCO : ప్రధాని మెడీ జన్మస్థలం వాద్‌నగర్‌తో పాటు భారత్‌లో మూడు ప్రదేశాలకు యునెస్కో గుర్తింపు..

 భారత్ లో మరో మూడు ప్రదేశాలకు యునెస్కో గుర్తింపు లభించింది. ప్రధాని నరేంద్ర మోడీ జన్మ స్థలం గుజరాత్ లోని వాద్ నగర్ తో పాటు ఈశాన్య రాష్ట్రాల ఆన్‌కోర్‌వాట్‌గా పిలిచే త్రిపురలోని ఉనాకోటీ (రాతి శిల్పాలు)మొతెరాలోని సూర్య దేవాలయాలకు ఈ గౌరవం దక్కింది. దీంతో భారత్‌లోని మూడు చారిత్రక స్థలాలను ప్రపంచ వారసత్వ కట్టడాల తాత్కాలిక (టెన్టెటివ్‌) జాబితాలో చేర్చుతున్నట్లుగా ఆర్కియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా ప్రకటించింది.

UNESCO : ప్రధాని మెడీ జన్మస్థలం వాద్‌నగర్‌తో పాటు భారత్‌లో మూడు ప్రదేశాలకు యునెస్కో గుర్తింపు..

UNESCO recognizes three places in India.

UNESCO : భారత్ లో మరో మూడు ప్రదేశాలకు యునెస్కో గుర్తింపు లభించింది. ప్రధాని నరేంద్ర మోడీ జన్మ స్థలం గుజరాత్ లోని వాద్ నగర్ తో పాటు ఈశాన్య రాష్ట్రాల ఆన్‌కోర్‌వాట్‌గా పిలిచే త్రిపురలోని ఉనాకోటీ (రాతి శిల్పాలు)మొతెరాలోని సూర్య దేవాలయాలకు ఈ గౌరవం దక్కింది. దీంతో భారత్‌లోని మూడు చారిత్రక స్థలాలను ప్రపంచ వారసత్వ కట్టడాల తాత్కాలిక (టెన్టెటివ్‌) జాబితాలో చేర్చుతున్నట్లుగా ఆర్కియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (ఏఎస్‌ఐ) మంగళవారం (డిసెంబర్ 20,2022)ప్రకటించింది.

వాడ్‌నగర్‌ ప్రధాని మోడీ స్వస్థలం అనే విషయం తెలిసిందే. ఈ మూడు ప్రదేశాల చిత్రాలనూ కేంద్ర పర్యటకశాఖ మంత్రి కిషన్‌రెడ్డి ట్వీట్‌ ద్వారా అభినందనలు తెలిపారు. వారసత్వ కట్టడాల తాత్కాలిక జాబితాకు ఈ మూడు ప్రదేశాలను భారత ప్రభుత్వం ప్రతిపాదించింది. దీనికి సంబంధించి 15 రోజుల క్రితం నామినేషన్లను పంపించింది. వాటిని క్షుణ్ణంగా పరిశీలించిన మీదట యునెస్కో ఆమోదించింది.వీటితో కలిసి భారత్ నుంచి ఈ సంవత్సరం మొత్తం ఆరు చారిత్రక ప్రదేశాలకు యునెస్కో ఆమోదం లభించినట్లైంది. భారత్‌ నుంచి ఆరు వారసత్వ కట్టడాల తాత్కాలిక జాబితాలో చోటు దక్కించుకున్నాయి. వీటిలో భాగంగా ప్రధాని మోడీ స్వస్థలం అయిన వాద్ నగర్ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలోకి చేరింది. పోయింది. వాద్ నగర్ తో పాటు మొతెరాలోని సూర్య దేవాలయం, త్రిపురలోని ఉనకోటిలు ప్రపంచ వారసత్వ ప్రదేశాల గుర్తింపు పొందాయి.

కాగా..యునెస్కో ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల నుంచి వచ్చే నామినేషన్లను అన్నికోణాల్లోను పరిశీలిస్తుంది. వాటి వెనుక ఉన్న చరిత్ర..ఏకాలం నాటివి..వాటికి ఉండే ప్రాముఖ్యత వంటి అన్ని విషయాలను పరిశీలించిన మీదట తగిన అర్హతలు ఉన్న వాటికి జాబితాలో చోటు కల్పిస్తుంటుంది. సాంస్కృతికంగా, చారిత్రకంగా తగిన అర్హతలు ఉంటేనే పరిగణనలోకి తీసుకుని ప్రాధాన్యత కల్పిస్తూ ప్రకటన చేస్తుంది.

ఈక్రమంలో ఎంతో ప్రాచీన చరిత్ర కలిగిన భారత్ లోని మరిన్ని స్మారక చిహ్నాలు, ప్రదేశాలను ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో చోటు దక్కాల్సి ఉంది. ఈక్రమంలో తాజాగా చేర్చిన ఈ మూడు ప్రదేశాలతో కలిపి ప్రపంచ వారసత్వ కట్డడాలు, ప్రదేశాల జాబితాలో భారత్ నుంచి చేరిన వాటి సంఖ్య 52కు పెరిగింది. కాగా..వాద్ నగర్ పట్టణానికి ఘన చరిత్ర ఉందని..కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ పట్టణంలో ఇప్పటికీ పెద్ద సంఖ్యలో చారిత్రక భవనాలు ఉన్నాయని తెలిపారు మంత్రి కిషన్ రెడ్డి.