Russia : నది నుంచి ఆకాశం వరకూ.. బంగారు రంగులో నీటి ధార.. అమేజింగ్ వీడియో వైరల్
ప్రకృతిలో కొన్ని అందాలు చూస్తే వండర్ అయిపోతాం. ఒక నది నుంచి బంగారు వర్ణంలో పొడవైన నీటి ధార ఆకాశాన్ని తాకింది. కళ్లను కట్టి పడేసేలా ఉన్న ఆ అమేజింగ్ వీడియో మిస్ కాకుండా చూడండి.

Russia
Russia : నేచర్‌లో కొన్ని అందాలు చూస్తే ఫిదా అయిపోతాం. అద్భుతమైన ప్రకృతి దృశ్యాన్ని చూపించే వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.
రష్యాలోని పర్మ్ ప్రాంతంలో ఉంది కామ నది. దాని ఉపరితలంపై అద్భుతమైన నీటి ధార కనిపించింది. పడవలో వెళ్తున్న ప్రయాణికులను ఆ విజువల్ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ వీడియోను వారు క్యాప్చర్ చేశారు. @djuric_zlatko అనే ట్విట్టర్ యూజర్ ‘ప్రకృతి మరియు మనస్తత్వం మధ్య కొంచెం తేడా ఉంది… కామ నది. పెర్మ్ ప్రాంతం. జూలై 13, 2023’ అనే శీర్షికతో ఈ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోయారు. ‘అద్భుతంగా ఉంది.. కానీ ఇది ఏం చేస్తుంది’ అని ‘చాలా బాగుంది.. భయానకంగా కూడా ఉంది’ అని వరుసగా కామెంట్లు పెట్టారు.
China : పచ్చని ప్రకృతి నడుమ వెరైటీ ఆకారంలో రెస్టారెంట్.. ఫిదా అవుతున్న కస్టమర్లు
ఈ నీటి ధార అనేది సాధారణంగా సుడిగాలి వల్ల సముద్ర ఉపరితలాలపై ఏర్పడతాయి. అలాగే ఉష్ణమండల ప్రాంతాల్లోకూడా కనిపిస్తాయి. యూరప్, మిడిల్-ఈస్ట్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అంటార్కిటికాతో సహా పలుప్రాంతాల్లో చాలా అరుదైన సందర్భాల్లో ఈ నీటి ధారలు కనిపిస్తాయి.
A little about nature and the difference of mentality. Kama River. Perm region. July 13, 2023. pic.twitter.com/AaWTHqrnCR
— Zlatti71 (@djuric_zlatko) July 17, 2023