America : పక్షవాతం ఉందని చెప్పినా…జుట్టుపట్టి కిందకు లాగేసిన అమెరికా పోలీసులు

తనకు పక్షవాతం ఉందని చెప్పినా..వినిపించుకోకుండా..కర్కశంగా వ్యవహరించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

America : పక్షవాతం ఉందని చెప్పినా…జుట్టుపట్టి కిందకు లాగేసిన అమెరికా పోలీసులు

America Police

American Police : అమెరికాలో పోలీసులు దారుణంగా ప్రవర్తిస్తున్నారు. వివిధ కారణాల నిమిత్తం అమెరికాలో ఉంటున్న విదేశీయులపట్ల కర్కశంగా ప్రవర్తిస్తున్నారు. ఎలాంటి కారణం లేకుండానే..వారిపై దాడులకు పాల్పడుతున్నారు. పోలీసుల దురంహకారానికి ఎంతో మంది చనిపోయారు కూడా. అయినా…కూడా కొంతమందిలో మార్పు రావడం లేదు. పోలీసుల జాత్సాంహకారంపై తీవ్ర నిరసనలు వ్యక్తమౌతున్నాయి. ఇదిలా ఉండగా..మరోసారి అమెరికా పోలీసులు రెచ్చిపోవడం దుమారం రేగుతోంది. కారులో కూర్చొన్న వ్యక్తిని జట్టు పట్టి..నిర్ధాక్షిణ్యంగా బయటకు లాగేశారు. తనకు పక్షవాతం ఉందని చెప్పినా..వినిపించుకోకుండా..కర్కశంగా వ్యవహరించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

Read More : Kylie Jenner photoshoot :‘రక్తం’లో తడిసి ముద్దైనట్లుగా నటి ఫోటోషూట్..తిట్టిపోస్తున్న అభిమానులు

కారులో పొడవాటి జుట్టు ఉన్న వ్యక్తి కూర్చొన్నాడు. పోలీసులతో ఏదో మాట్లాడుతున్నట్లుగా ఉంది. ఏదో ప్రశ్నించగా..ఫోన్ తీసి పక్కకు పెట్టాడు. తనకు పక్షవాతం ఉందని, కాళ్లు పనిచేయవని చెప్పాడు. కానీ అమాతం..పోలీసులు కారు డోర్ తీసి..చేతులు..కాళ్లు పట్టుకుని కిందపడేశారు. మరొకరు జట్టు పట్టుకుని లాగి పడేశారు. ఎందుకిలా చేస్తున్నారంటూ ప్రశిస్తుండగా.. ఆ వ్యక్తి రెండు చేతులు గట్టిగా పట్టుకున్నారు. అయితే..ఈ ఘటన ఎక్కడి జరిగిందో తెలియలేదు. నెట్టింట చక్కర్లు కొడుతున్న ఈ వీడియోలో..నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. పోలీసుల వైఖరిని ప్రశ్నిస్తున్నారు. గతంలో జార్జ్ ఫ్లాయిడ్ హత్య ఎలాంటి దుమారం చెలరేగిందో తెలిసిందే. తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఆందోళనలు, నిరసలతో అగ్రరాజ్యం అట్టుడికింది. వీ కాంట్ బ్రీత్ పేరిట పెద్ద ఉద్యమమే నడిచింది.