మూడు చిరుతలకు కరోనా : అగ్రరాజ్యం వాటిని ఏం చేస్తుందో

  • Published By: nagamani ,Published On : December 15, 2020 / 10:43 AM IST
మూడు చిరుతలకు కరోనా : అగ్రరాజ్యం వాటిని ఏం చేస్తుందో

American three snow leapards tested corona positive : అమెరికాలోని కెంటక్కీలో ఉన్న లూయిస్‌విల్లె జూలో ఉన్న మంచు చిరుతలకు కరోనా సోకిందనేదే ఆ వార్త. ఇప్పటి వరకూ ఇలా జంతువులకు కరోనా సోకిన ఘటనలు చాలా తక్కువనే చెప్పాలి. అసలే ప్రపంచంలోనే అత్యధికంగా కరోనా కేసులు నమోదైంది అమెరికాలోనే. ఈక్రమంలో వచ్చిన అమెరికాల ఎన్నికల్లో కూడా కరోనా కీలక పాత్ర వహించింది. అధ్యక్షుడు ట్రంప్ కరోనా విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోవటంవల్లనే కేసులు భారీస్థాయికి చేరుకున్నాయనే ప్రచారం ప్రతిపక్షాల నుంచి గట్టిగా వినిపించిన విషయం తెలిసిందే. అలా ఎట్టకేలకు ట్రంప్ పై బైడెన్ విజయం సాధించారు. కానీ ఇంకా బాధ్యతలు తీసుకోలేదు.

ఈ క్రమంలో ప్రజలకు డొనాల్డ్ ట్రంప్ శుభవార్త చెబుతూ..బ్రిటన్‌లో ఆమోదం పొందిన ఫైజర్ కరోనా వ్యాక్సిన్‌కు అమెరికాలో కూడా గ్రీన్ సిగ్నల్ లభించిందని ప్రకటించారు. 24 గంటల్లోనే ఈ వ్యాక్సీన్ పంపిణీ మొదలు పెడతామని కూడా ప్రకటించారు. ట్రంప్ ప్రకటనతో ఇంతకాలం కరోనా భయంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బ్రతికిన అమెరికన్లకు కొంత ఊరట లభించింది. ఈ వ్యాక్సీన్ వేస్తే కరోనా వ్యాధి 90శాతం నయం అవుతుందని పరిశోధనల్లో తేలింది. ఈ విషయమే ప్రజల్లో కొంత ఆనందం నింపింది.

ఇప్పటికే దాదాపు 10కోట్ల వ్యాక్సీన్ డోసులు కొనుగోలు చేసిన అగ్రరాజ్యం.. మరో 10 కోట్ల వ్యాక్సిన్ డోసులు కొనుగోలు చేయబోతున్నట్లు కూడా ప్రకటించింది. అలాగే 2021 మార్చి నాటికల్లా పది కోట్ల మందికి కరోనా టీకాలు వేసేస్తామని అధికారులు ప్రకటించారు. అంటే కరోనా దాదాపు అదుపులోకి వచ్చినట్లేనని అంతా భావించారు. అయితే వీరందరికీ తాజాగా ఓ వార్త మరోసారి భయం కలిగించింది.

ఈక్రమంలో మూడు చిరుతలకు కరోనా సోకిందని తెలిసిన అధికారులు ఖంగుతిన్నారు. అయితే దీనిపై స్పందించిన జూ అధికారులు.. కరోనా సోకిన చిరుతల్లో వైరస్ తీవ్రత తక్కువగానే ఉందని..చిన్నపాటి లక్షణాలు మాత్రమే కనిపించాయని తెలిపారు. వీటిలో కరోనా తీవ్రత తక్కువగా ఉండటంతో త్వరలోనే చిరుతలు కోలుకుంటాయని స్పష్టం చేశారు. జూలో పనిచేసే ఓ వ్యక్తి వల్లే ఈ చిరుతలకు కరోనా సోకినట్లు తేలింది.

కాగా నెదర్లాండ్ దేశంలో ఉడుతల్లా ఉండే మింక్ జంతువులకు కరోనా సోకుతోందని గుర్తించిన ప్రభుత్వం ఈ జీవులను భారీ సంఖ్యలో హతమార్చింది. వీటివల్ల మనుషులకు కరోనా సోకే ప్రమాదం ఉందని ప్రభుత్వం వేలాది మింక్ లకు చంపించేసింది. మరి ఇప్పుడు అమెరికా ఈ చిరుతల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.