Viral Video : కాలువలోంచి కుప్పలు తెప్పలుగా బయటపడుతున్న సైకిళ్లు ..!

కాలువను శుభ్రం చేస్తుంటే వేల కొద్దీ సైకిళ్లు బయటపడుతున్నాయి. కుప్పలు తెప్పలుగా బయటపడుతున్న సైకిళ్లకు చెందిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Viral Video : కాలువలోంచి కుప్పలు తెప్పలుగా బయటపడుతున్న సైకిళ్లు ..!

Bicycles In amsterdam city canal : కాలువను శుభ్రం చేస్తుంటే వేలకొద్దీ సైకిళ్లు బయటపడుతున్నాయి. కుప్పలు తెప్పలుగా బయటపడుతున్న సైకిళ్లకు చెందిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ జేసీబీ కాలువను శుభ్రం చేస్తుంటే వేలకొద్దీ సైకిళ్లు బయటపడుతున్నట్టుగా కనిపిస్తోంది.ఇంతకీ ఈసైకిళ్లను ఎవరు పారేశారు? ఎందుకు పారేశారు..? తెలుసుకుందాం..

నెదర్లాండ్ (Netherlands)రాజధాని ఆమ్ స్టర్ డ్యామ్(amsterdam). ఈ నగరాన్ని ‘బైస్కిల్ కేపిటల్’ (Bicycle Capital)అని ‘సైక్లింగ్ కేపిటల్ ఆఫ్ ది వరల్డ్’(Cycling Capital of the World)అని అంటారు. ఎందుకంటే ఆ నగరవాసులు ఎక్కువగా సైకిళ్లు వాడతారు. ఇక్కడి జనాభా కంటే సైకిళ్ల సంఖ్యే డబుల్ గా ఉంటుంది. అంటే అన్ని సైకిళ్లు ఉంటాయ్యన్నమాట. పర్యావరణానికి హాని కలుగకుండా నగరవాసులు సైకిళ్లను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అంతేకాదు ఓ మాదిరి దూరంలో పనిమీద వెళ్లాలన్నా నగరవాసులు సైకిళ్లే ఉపయోగిస్తుంటారు. పర్యావరణానికి హానీ కలుగకుండా మరోపక్క ఆరోగ్యానికి సైక్లింగ్ చక్కటి వ్యాయామం అనే ఆలోచనతో నగరవాసులు సైకిళ్ల వాడకం ఎక్కువ ఉపయోగిస్తారు.

Sneakers for horses : గుర్రాలకు నాడాలు కాదు బ్రాండెండ్ షూస్ .. ధర వింటే దిమ్మ తిరిగిపోద్ది

కానీ అవే సైకిళ్లు ఆ నగరంలోని ఓ ఇబ్బందిగా మారాయి. ఆమ్ స్టర్ డ్యామ్ నగరంలోని 160పైనే కాలువలు ఉన్నాయి. నగర వాసులు ఏదైనా పనిమీద సైకిల్ పై వచ్చినప్పుడు సైకిళ్లను కాలువ పక్కన పార్క్ చేస్తుంటారు. గాలి వచ్చినప్పుడు సైకిళ్లు ఆ కాలువల్లో పడిపోతుంటాయి. అంతేకాకుండా కొంతమంది వాడేసిన సైకిళ్లను పాతవి అయిపోయాక వాటిని కాలువల్లో పారేస్తారని ఓ సర్వేలో తేలింది.

అట్లాంటిక్ సముద్రాన్ని (Atlantic Ocean)ఆనుకుని ఉండే ఆమ్ స్టర్ డ్యామ్ నగరంలోని 160పైనే కాలువలు ఉన్నాయి. ఈ కాలువల్లో పడవలు రాకపోకలు సాగిస్తుంటాయి. దీంతో ఈ కాలువల్ని తరచు శుభ్రం చేస్తుంటారు. చెత్తా చెదారం ఉంటే వాటిని శుభ్రం చేస్తుంటారు. అలా శుభ్రం చేసినప్పుడు భారీ సంఖ్యలో సైకిళ్లు బయటపడుతుంటాయి. అలా తాజాగా గత బుధవారం (సెప్టెంబర్,2023) కాలువల్ని శుభ్రం చేస్తుంటే ఓ ప్రాంతంలో వేల సంఖ్యలో సైకిళ్లు బయటపడ్డాయి.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా ఓ సర్వే ప్రకారంగా చూస్తే ఆమ్ స్టర్ డ్యామ్ కాలువల్లో ఏటా దాదాపు 15 వేల సైకిళ్లు బయటపడుతుంటాయని తేలింది.