Pig Heart Transplant : పందిగుండె మార్పిడి తర్వాత మరణించిన వ్యక్తిలో జంతు సంబంధిత వైరస్ గుర్తించిన నిపుణులు

పందిగుండె మార్పిడి తర్వాత మరణించిన వ్యక్తిలో నిపుణులు జంతు సంబంధిత వైరస్ గుర్తించారు.

Pig Heart Transplant : పందిగుండె మార్పిడి తర్వాత మరణించిన వ్యక్తిలో జంతు సంబంధిత వైరస్ గుర్తించిన నిపుణులు

Pig Heart Transplant

Pig Heart Transplant : ప్రపంచంలో మొదటిసారిగా ఓ వ్యక్తికి డాక్టర్లు పంది గుండె అమర్చారు. ఈ ఆపరేషన్ సక్సెస్ అయ్యిందని ఆనందింనన్ని రోజులు కూడా లేకుండా పంది గుండె అమర్చిన రోగి రెండు నెలలకే మరణించాడు. అలా మరణించిన ఆ రోగి శరీరంలో నిపుణులు జంతు వైరస్ ను గుర్తించారు. కాగా అతను మరణించింది ఆ జంతు వైరస్ వల్లా?కాదా? అనే విషయం ఇంకా తేలాల్సి ఉంది.

Pig Heart: మనిషికి పంది గుండె.. ఆపరేషన్ సక్సెస్!

అమెరికాలోని మేరీల్యాండ్‌కు చెందిన 57 ఏళ్ల డేవిడ్ బెన్నెట్ సీనియర్‌కు డాక్టర్లు విజయవంతంగా పందిగుండెను అమర్చారు. అయితే, ఆ తర్వాత రెండు నెలలకే అంటే మార్చిలో ఆయన మృతి చెందారు. ఆయన శరీరంలో యానిమల్ వైరస్‌ను గుర్తించినట్టు తాజాగా మేరీల్యాండ్ యూనివర్సిటీ నిపుణులు వెల్లడించారు. పందిగుండె లోపల వైరల్ డీఎన్ఏను గుర్తించామని తెలిపారు. పోర్సిన్ సైటోమెగలోవైరస్ అని పిలిచే ఈ బగ్ యాక్టివ్ ఇన్ఫెక్షన్‌కు కారణమవుతుందన్న సంకేతాలను కనుగొనలేదు.

David Bennett : పంది గుండె అమర్చిన మొదటి వ్యక్తి మృతి!

కాగా.. జంతువుల నుంచి మనిషికి అవయవ మార్పిడికి సంబంధించి ఇప్పుడు వైద్యులను ఇది ఆందోళనకు గురిచేస్తోంది. జంతువుల అవయవాల మార్పిడి వల్ల కొత్త రకాల ఇన్ఫెక్షన్లు పుట్టుకొచ్చే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. కొన్ని వైరస్‌లు రహస్యంగా ఉంటాయని అవి వ్యాధిని కలిగించకుండా దాగి ఉంటాయని బెన్నెట్‌కు పందిగుండె అమర్చిన సర్జన్ డాక్టర్ బార్ట్‌లీ గ్రిఫిత్ పేర్కొన్నారు. బహుశా అది ఒక ‘హిచ్‌హైకర్’ అయి ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.