గ్రీన్ కార్డు పొందే ముందే తెలుగు టెక్కీ మృతి

గ్రీన్ కార్డు పొందే ముందే తెలుగు టెక్కీ మృతి

అమెరికాలో గ్రీన్ కార్డ్ పొందనున్న కొద్ది రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ కు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అక్టోబరు 29న మరణించారు. రాజమండ్రికి చెందిన శివ చలపతిరాజు నార్త్ కరోలినాలో పనిచేస్తున్నారు. ఉపాధి కోసం వెళ్లి అమెరికాలో స్థిరపడ్డారు. నార్త్ కరోలినాలోని పలు కంపెనీల్లో పనిచేశారు. ఆయన భార్య సౌజన్య నిండు గర్భవతిగా ఉండి అర్థాంతరంగా భారత్ కు తరలివచ్చారు.

గ్రీన్‌కార్డ్ బ్యాక్‌లాగ్ లిస్టులో ఉన్న అతని మరణం పట్ల అమెరికాలోని తెలుగు సంఘాలు విచారం వ్యక్తం చేశాయి. మృతదేహాన్ని స్వదేశం తరలించేందుకు ఆర్థిక పరిస్థితి సహకరించకపోవడంతో తెలుగు సంఘాలను ఆశ్రయించారు. ఈ క్రమంలోనే పీడిమాంట్ ఏరియా తెలుగు అసోసియేషన్ ‘గోఫండ్ మీ’ పేరిట ద్వారా విరాళాలు సేకరిస్తోంది.

ఇమిగ్రేషన్ అధికారుల ఇలా ట్వీట్ చేశారు. ‘ఈ ఘటన పట్ల మేం విచారిస్తున్నాం. డర్బిన్ సెనేటర్ #S386ను బ్లాక్ చేయలేదు. దీంతో గ్రీన్ కార్డ్ పొందేందుకు వారి కుటుంబ సభ్యులకు అవకాశం ఉంది. లేదా యూరప్ లో ఉండే వారెవరైనా గ్రీన్ కార్డు దక్కించుకోవచ్చు’ అని అధికారులు తెలిపారు.