Cris Galera : తనను పెళ్లి చేసుకుంటే రూ.4 కోట్లు ఇస్తానన్న అరబ్ షేక్.. సున్నితంగా తిరస్కరించిన మోడల్

తనను తాను పెళ్లి చేసుకున్న మోడల్ కు అరబ్ షేక్ ఓ ఆఫర్ ఇచ్చారు. నీకు నువ్వు విడాకులు తీసుకోని తనని పెళ్లి చేసుకుంటే నాలుగు కోట్లు ఇస్తానని ప్రకటించాడు.

Cris Galera : తనను పెళ్లి చేసుకుంటే రూ.4 కోట్లు ఇస్తానన్న అరబ్ షేక్.. సున్నితంగా తిరస్కరించిన మోడల్

Cris Galêra

Updated On : September 27, 2021 / 11:40 AM IST

Cris Galera : చాలామంది మహిళలు ఒంటరి జీవితం గడిపేందుకు ఇష్టపడుతుంటారు. మగారితో విసిగివేసారి ఇక వారితో తమ సంబంధం కొనసాగించలేమని వదిలేసి వంటరి జీవితం గడుపుతున్న మహిళలు చాలామందే ఉంటారు. అయితే ఇలానే చేసింది బ్రెజిల్‌కు చెందిన ఓ మోడ‌ల్‌ ఒంటరిగా బతకాలని అనుకుంది.. అందుకే తనను తానే పెళ్లి చేసుకుంది. 33 ఏళ్ల మోడల్ క్రిస్ గ‌లెరా తనను తాను పెళ్లి చేసుకున్న క్రిస్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అందరు తన పెళ్లి గురించే మాట్లాడుతున్నారు.

Read More : Drugs Into India : భారత్ లోకి నిషేధిత డ్రగ్స్ అసలు ఎలా వస్తున్నాయ్ తెలుసా

తన పెళ్లి ఫోటోలు చూసిన అరబ్ షేక్ ఆకర్షితుడయ్యాడు. దీంతో ఆమెకు బంపర్ ఆఫర్ ఇచ్చాడు షేక్.. తనను మ్యారేజ్ చేసుకోవాలని ప్రపోజల్ చేశాడు. అందుకు గాను నాలుగు కోట్ల ఎదురు కట్నం ఇస్తానని ప్రకటించాడు. నీకు నువ్వు విడాకులు తీసుకోని తనను పెళ్లి చేసుకోమని కోరాడు షేక్.. ప్రపోజల్ పంపిన షేక్ తో ఫోన్ లో మాట్లాడిన క్రిస్.. సింపుల్ గా అతడి ప్రపోజల్ ను రిజెక్టు చేసింది.

Read More : Bharat Bandh : తెలంగాణ నుంచి ఏపీకి బస్సులు బంద్

నేనేం ఆటవస్తువు కాదు మీరు కొనడానికి అంటూ షేక్ ఆఫర్ ను తిరస్కరించింది. తనకు న‌చ్చిన‌న్ని రోజులు ఇలాగే ఒంట‌రిగా గ‌డుపుతానంటూ క్రిస్ పేర్కొంది.