రెండు కాళ్లతో లక్షలు సంపాదిస్తున్న ‘సోల్ సోగ్గాడు’

  • Published By: nagamani ,Published On : August 26, 2020 / 12:49 PM IST
రెండు కాళ్లతో లక్షలు సంపాదిస్తున్న ‘సోల్ సోగ్గాడు’

Updated On : August 26, 2020 / 2:09 PM IST

వాడికేంటిరా..పెద్దలు సంపాదించిన ఆస్తి..కాలు మీద కాలు వేసుకుని కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది..అని అంటుంటాం. కానీ ఏమీ చేయకుండా కేవలం కాలు మీద కాలు వేసుకుని డబ్బులు సంపాదించవచ్చని మీకు తెలుసా? జోక్ కాదు..నిజమేనండీ..తన కాళ్లను ఫోటోలు తీసి వాటిని ఆన్ లైన్ లో పెట్టి అమ్మేస్తూ లక్షలు లక్షలు సంపాదిస్తున్నాడో ఓ వ్యక్తి. అతని పేరు జాసన్ స్మార్ట్.



అమెరికాలోని ఆరిజోనాకు చెందిన జాస‌న్ స్టార్మ్ అనే 35 ఏళ్ల వ్యక్తి. కేవలం తన కాళ్ల ఫొటోలు, వీడియోలు తీసి .లక్ష‌ల్లో సంపాదిస్తున్నాడు. ప్రతీ రోజూ త‌న రెండు కాళ్ల‌ను ఫొటోలు తీసి ఆన్‌లైన్‌లో అమ్మ‌డాన్నే వృత్తిగా చేసుకుని డబ్బులు సంపాదించేస్తున్నాడు జాసన్. విచిత్రం ఏమిటంటే అతని కాళ్ల ఫోటోలను యువతీ యువకులు ఎగ‌బ‌డి కొనటం…!!




https://10tv.in/greta-thunberg-returns-to-school-after-year-of-climate-activism/
ఇలా తీసిన ఈ ఫొటోల ద్వారా నెల‌కు 2.9 ల‌క్ష‌లు రూపాయలు సంపాదిస్తున్నాడు. తన కాళ్ళ ఫోటోలను, వీడియోల‌ను ఎప్పటికప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా‌ షేర్ చేస్తున్నాడు. తన కాళ్ళ ఫోటోల కోసం ‘ఓన్లీఫ్యాన్స్’ అనే ఓ వెబ్‌సైట్‌ను కూడా నిర్వహిస్తున్నాడు. ఈ వెబ్‌సైట్ లో తన కాళ్ళ ఫోటోలను, వీడియోలను చూడాలంటే నెల‌కు ఎనిమిది అమెరికన్ డాల‌ర్లు..అదే సంవ‌త్స‌రానికైతే దాదాపు 81 అమెరికన్ డాల‌ర్లు కట్టాల్సి ఉంటుంది.







కాగా జాసన్ స్మార్ట్ గతంలో వెబ్ క్యామర్ గా పనిచేసేవాడు. అతని క్లైంట్స్ చాలా మంది అతని పాదాల సోల్ ఫోటోలను పెట్టమని అడిగేవారు. దీంతో అతనికో ఐడియా వచ్చింది. పాదాలను ఫోటోలు తీసి సోషల్ మీడియా ద్వారా డబ్బులు సంపాదించాలనే ఐడియాను ఇలా తన అరికాళ్ళను ఫోటోలు తీయటాన్ని వృత్తిగా పెట్టుకున్నాడు.అలా తన ఇన్‌స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ ను సంపాదించుకుని ఇప్పుడు ఇలా డబ్బులు సంపాదించేస్తున్నాడు జాసన్ స్మార్ట్ .