Covid Vaccine : వాక్సిన్ వేయించుకోండీ..20 కేజీల బియ్యం ఉచితంగా పట్టుకెళ్లండీ..

కరోనా వ్యాక్సిన్ వచ్చి ఇంతకాలం అయినా చాలా ప్రాంతాల్లో టీకా వేయించుకోవటానికి జనాలు భయపడుతునే ఉన్నారు. ఈక్రమంలో అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం వ్యాక్సిన్ వేయించుకుంటే 20 కిలోల బియ్యం ఫ్రీగా ఇస్తామని.. ప్రభుత్వ అధికారులు ప్రకటించారు. రకాలుగా ప్రజలకు వివరించిన కానీ లాభం లేకుండా పోతుంది. ఈ నేపథ్యంలోనే అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఓ వినూత్నంగా ఆలోచించింది.

Covid Vaccine : వాక్సిన్ వేయించుకోండీ..20 కేజీల బియ్యం ఉచితంగా పట్టుకెళ్లండీ..

20 Kg Rise Free

Free Rice..Covid Vaccine: కరోనా వ్యాక్సిన్ వచ్చి ఇంతకాలం అయినా చాలా ప్రాంతాల్లో టీకా వేయించుకోవటానికి జనాలు భయపడుతునే ఉన్నారు. ఈక్రమంలో పలు ప్రాంతాల్లో వింత వింత ఆఫర్లు ప్రకటిస్తున్నారు. బీర్లు ఫ్రీ అనీ..టమోటాలు, ఉల్లిపాయలు ఫ్రీ అని..ముక్కుపుడకలు ఫ్రీ అని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈక్రమంలో అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వ అధికారులు ఓ వినూత్న ఆలోచన చేశారు..ఇటు ప్రజలకు ఉపయోగపడేలా..ఇటు వ్యాక్సిన్ వేయించుకునేలా చేసేందుకు వ్యాక్సిన్ వేయించుకుంటే 20 కిలోల బియ్యం ఫ్రీగా ఇస్తామని ప్రకటించారు.

అరుణాచల్ ప్రదేశ్ లోని ఒక అడ్మినిస్ట్రేటివ్ సర్కిల్ కు చెందిన గ్రామస్తులలో టీకా పట్ల ఉన్న అపోహాలను తొలగించటానికి పలు అవగాహనా కార్యక్రమాలు చేపట్టింది. సుబన్‌సిరి జిల్లాలోని యాజాలికి చెందిన సర్కిల్ ఆఫీసర్ తాషి వాంగ్‌చుక్ థాంగ్‌డోక్ కి వచ్చిన ఆలోచనతో వ్యాక్సిన్ వేసుకున్నవారికి 20 కిలోల బియ్యం ఇస్తామని ప్రకటించింది. ఈ ప్రకటన చేసిన అతి కొద్ది రోజుల్లోనే 80 మందికి పైగా టీకాలు వేయించుకోవానికి వచ్చారు. 45 సంవత్సరాలు నిండినవారికి టీకా వేసే ఉచిత బియ్యం కార్యక్రమాన్ని సోమవారం నుంచి ప్రారంభించి బుధవారం వరకు వేయనుంది.

దీనిపై తాషి వాంగ్ చుక్ థాంగోడోక్ మాట్లాడుతూ..జిల్లాలోని గ్రామాల్లో టీకా పై అపోహాలను తొలగించడానికి కృషి చేస్తున్నామని ..జూన్ 20 వచ్చేసరికి 100 శాతం టీకాలు వేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. వ్యాక్సిన్ ఇవ్వడానికి వారం చివరిలో ప్రజల ఇళ్లకే వెళ్లి వేసత్ామని తెలిపారు. ఈ 20 కిలోల బియ్య ఆఫర్ పూర్తి అయిన తరువాత 20 కిలోలకు బదులుగా 10కిలోల బియ్యం ఇస్తామని తెలిపారు.