Asteroid : బుర్జ్ ఖలీఫా కంటే భారీ గ్రహశకలం ఈ రోజే భూమివైపు దూసుకొస్తోంది..!

అదో భారీ గ్రహశకలం.. బుర్జ్ ఖలీఫా కంటే అతిపెద్దది.. 94వేల కిలోమీటర్ల వేగంతో ఆగస్టు 21 శనివారం రోజున భూమివైపు దూసుకొస్తోంది.

Asteroid : బుర్జ్ ఖలీఫా కంటే భారీ గ్రహశకలం ఈ రోజే భూమివైపు దూసుకొస్తోంది..!

Asteroid Bigger Than Burj Khalifa

Asteroid bigger than Burj Khalifa : అదో భారీ గ్రహశకలం.. బుర్జ్ ఖలీఫా కంటే అతిపెద్దది.. 94వేల కిలోమీటర్ల వేగంతో భూమివైపు దూసుకొస్తోంది. ఆగస్టు 21 శనివారం రోజున ఈ భారీ గ్రహశకలం భూమికి సమీపంగా వచ్చి వెళ్లనుంది. Earthsky నివేదిక ప్రకారం.. 2016 AJ193 అనే ఈ గ్రహశకలం 5.91 సంవత్సరాల కక్ష్యలో సూర్యుడి వైపు దూసుకుపోతున్నట్లు కనిపిస్తోంది. ఈ గ్రహశకలం ఆగస్టు 21 రాత్రి భూమికి దగ్గరగా రానుందని NASA చెబుతోంది. అయితే ఇది ఏ క్షణమైనా ఢీకొట్టే ముప్పు పొంచి ఉందని నివేదిక అంచనా వేస్తోంది. ఈ గ్రహశకలం ఒక మైలు వెడల్పు (1.4 కిలోమీటర్ల వెడల్పు) కంటే తక్కువగా ఉంటుందని అంచనా. సుమారు 4,500 అడుగుల వ్యాసంతో ఉంటుంది. అంటే.. బుర్జ్ ఖలీఫా (Burj Khalifa) పరిమాణం కంటే భారీగా ఉండనున్నట్టు తెలుస్తోంది. ఈ ఆస్ట్రరాయిడ్.. గంటకు 58,538 మైళ్ల (94,208 కి.మీ/గంటకు) భారీ వేగంతో ప్రయాణిస్తుంది. అలాగే సెకనుకు 16 మైళ్లు (సెకనుకు 26.17 కిమీ)వేగంతో దూసుకొస్తోంది. రాబోయే 65 సంవత్సరాలలో భూమికి అతి దగ్గరగా రానున్న గ్రహశకలం ఇదే కానుంది.

Asteroid

గ్రహశకలం భూమిని ఢీకొడుతుందా?
భూమివైపు దూసుకొస్తున్న ఈ భారీ గ్రహశకలం అతి దగ్గరగా వెళ్లనుంది. ఢీకొట్టే పరిస్థితి లేదని నాసా సైంటిస్టులు చెబుతున్నారు. ఈ గ్రహశకలం భూమిని దాదాపు 8.9 చంద్రదూరం దాటి వెళుతుందని అంటున్నారు. గ్రహశకలం కక్ష్యను పరిశీలిస్తే.. అది భూమిని ఢీకొనే అవకాశం లేదని Earthsky నివేదించింది. నాసా ఖగోళ శాస్త్రవేత్తలు రాడార్ ఉపయోగించి ఆగస్టు 20 నుంచి ఆగస్టు 24 మధ్య గ్రహశకలాన్ని గమనాన్ని గమనిస్తున్నారు. భూమికి అత్యంత దగ్గరగా ఆగష్టు 21, 2021 ఉదయం 11:10 ET (8:40 pm IST) రానున్నట్టు అంచనా వేస్తున్నారు. అంటే సూర్యోదయానికి కొద్ది గంటల ముందు ఈ గ్రహశకలం భూమికి దగ్గరగా వెళ్లనుంది.

Asteroid Bigger Than Burj Khalifa, Speeding At 94,000 Kmph, To Pass By Earth Today

గ్రహశకలం కంటికి కనిపిస్తుందా? :
లేదంటున్నారు ఖగోళ సైంటిస్టులు.. ఇది కంటికి కనిపించదు.. గ్రహశకలం గమనాన్ని గుర్తించి అధ్యయనం చేసేంత దగ్గరగా ఉంటుందని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతేకాదు.. ప్రమాదకరమైనదిగా కూడా హెచ్చరిస్తున్నారు. ఈ గ్రహశకలం 2063 లోనూ భూమికి దగ్గరగా వస్తుందని నాసా కక్ష్య ట్రాక్‌ ద్వారా అంచనా వేసింది. ప్రస్తుతానికి మన గ్రహానికి ఎలాంటి హాని లేదని చెబుతోంది.

గ్రహశకలాలు అంటే ఏమిటి?
గ్రహశకలాలు సూర్యుని చుట్టూ తిరిగే చిన్న, రాతి వస్తువులుగా చెబుతారు. గ్రహశకలాలు సూర్యుడి చుట్టూ తిరుగుతుంటాయి. గ్రహాల కంటే చాలా చిన్నవిగా ఉంటాయి. వీటిని గ్రహాలు లేదా చిన్న గ్రహాలు అని కూడా పిలుస్తారు. వందల మైళ్ల నుంచి అనేక అడుగుల పరిమాణంలో లక్షలాది గ్రహశకలాలు ఉన్నాయి. వీటిలో ఎక్కువగా అంగారక గ్రహం, బృహస్పతి కక్ష్యల మధ్య ఉన్న ప్రధాన ఉల్క బెల్ట్‌లోనే తిరుగుతుంటాయి.

Asteroid Bigger Than Burj Khalifa

గ్రహశకలాల అన్నింటి ద్రవ్యరాశి భూమి చంద్రుడి కంటే తక్కువగా ఉంటుంది. పరిమాణం ఎలా ఉన్నప్పటికీ గ్రహశకలాలు ప్రమాదకరమే. గతంలో ఇలాంటి గ్రహశకలాలు భూమిని ఢీకొన్న పరిస్థితులు ఉన్నాయి. భవిష్యత్తులో మన గ్రహం మీదకు మరెన్నో గ్రహశకలాలు దూసుకొచ్చే ప్రమాదం లేకపోలేదు. ఉల్క కదలికలను ట్రాక్ చేసే నాసా జాయింట్ ప్రొపల్షన్ లాబొరేటరీ (JPL) ప్రకారం.. ఒక గ్రహశకలం మన గ్రహం నుండి భూమికి సూర్యుడికి దూరం (భూమి-సూర్యుడి దూరం) కంటే 1.3 రెట్లు తక్కువగా ఉంటుంది. దీని మధ్య దూరం సుమారు 93 మిలియన్ మైళ్లు ఉంటుందని అంచనా.