America Tornado : అమెరికాలో టోర్నడో బీభత్సం.. 26 మంది మృతి

అమెరికాలో టోర్నడో బీభత్సం సృష్టించింది. టోర్నడోల ధాటికి మొత్తం 26 మంది చనిపోయారు. అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. మరో నలుగురు అదృశ్యమయ్యారు.

America Tornado : అమెరికాలో టోర్నడో బీభత్సం.. 26 మంది మృతి

Tornado

America Tornado : అమెరికాలో టోర్నడో బీభత్సం సృష్టించింది. టోర్నడోల ధాటికి మొత్తం 26 మంది చనిపోయారు. అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. మరో నలుగురు అదృశ్యమయ్యారు. గల్లంతైన వారి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. మిసిసిప్పి ప్రాంతంలో టోర్నడోలు వల్ల ఇళ్లు, దుకాణాలతోపాటు ఇతర ఆస్తులన్నీ ధ్వంసం అయ్యాయి. తీవ్రమైన గాలివాన, బలమైన ఉరుములతో ఈ టోర్నడో సంభవించింది. టోర్నడో ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

గోల్ఫ్ బంతి సైజులో వడగళ్లు పడ్డాయి. టోర్నడోల ధాటికి ఈశాన్య జాక్సన్, మిసిసిప్పిలో 96 కిలో మీటర్ల మేర నష్టం వాటిల్లింది. ఇప్పటికే రెస్క్యూ టీమ్ టోర్నడోలు ప్రభావిత ప్రాంతంలో సహాయక చర్యలు చేపడుతోంది. టోర్నడోలు బీభత్సం సృష్టించిన వేళ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. ఇళ్లు కూలిపోవడంతో కొంతమంది శిథిలాల కింద చిక్కుకున్నారని భావిస్తున్నారు. గాయపడ్డ వారిని ఆస్పత్రులకు తరలించేందుకు రెస్క్యూ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.

Tornado Hits : టోర్నడో బీభత్సానికి 50 మంది మృతి

కానీ, వాతావరణం అనుకూలంగా లేకపోవడం వల్ల అక్కడ సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. అటు లాస్ ఎంజెల్స్, కాలిఫోర్నియా రాష్ట్రంలో టోర్నడో బీభత్సం సృష్టించింది. లాస్ ఎంజెల్స్ సమీపంంలోని మోంటెబెలో నగరాన్ని ఈ టోర్నడో పూర్తిగా కుదిపేసింది. టోర్నడో ప్రభావంతో భారీగా గాలి దుమారం ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టింది.

ఈ టోర్నడో కారణంగా గంటకు 85 మైళ్ల వేగంతో గాలులు వీచినట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇళ్ల బయట పార్క్ చేసి ఉంచిన కార్లు ధ్వంసం అయ్యాయి. భారీ టోర్నడోకు ఇంటి పైకప్పులు కొట్టుకుపోయాయి. ఈ టోర్నడో కారణంగా ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. సిటీలో జరిగిన మొత్తం నష్టాన్ని అధికారులు అంచనా వేస్తున్నారు.