Tornado Hits : టోర్నడో బీభత్సానికి 50 మంది మృతి

మృతుల సంఖ్య అధికమయ్యే అవకాశం ఉందని రాష్ట్ర గవర్నర్ ఆండీ బెషీర్ వెల్లడించారు. కెంటనీ చరిత్రలో అత్యంత తీవ్రమైనదిగా ఆయన అభివర్ణించారు...

Tornado Hits : టోర్నడో బీభత్సానికి 50 మంది మృతి

Us Tornado

Tornado Hits US : అమెరికాలో టోర్నడో బీభత్సం సృష్టించింది. ఈశాన్య రాష్ట్రంలోని కెంటకీలో టోర్నడో విళయానికి సుమారు 50 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య అధికమయ్యే అవకాశం ఉందని రాష్ట్ర గవర్నర్ ఆండీ బెషీర్ వెల్లడించారు. కెంటనీ చరిత్రలో అత్యంత తీవ్రమైనదిగా ఆయన అభివర్ణించారు. శుక్రవారం సంభవించిందిన టోర్నడో బీభత్సానికి అధికారులు అలర్ట్ అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా అత్యవసర పరిస్థితిని విధిస్తున్నట్లు ప్రకటించారు. సహాయక చర్యల కోసం సిబ్బంది రంగంలోకి దిగారు. కెంటకీలో సుమారు 180 మంది సహాయక చర్యలను చేపడుతున్నారు.

Read More : TTD : ఆకాశగంగ తీర్థ అభివృద్ధికి ఆనందసాయి సహకారం

టోర్నడో వల్ల కూలిపోయిన భవనాల కింద పలువురు చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. వీరిని రక్షించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో సుమారు 200 మేళ్ల మేర పలు జిల్లాలపై ప్రభావం చూపిందని, ఓ ఫ్యాక్టరీలో పైకప్పు కూలడంతో భారీగా ప్రాణ నష్టం జరిగిందని గవర్నర్ ఆండీ బెషీర్ తెలిపారు. స్థానికంగా ఉండే పోలీసులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఇతరులు సహాయక చర్యల్లో పాల్గొనాలని ఆయన సూచించారు. రాష్ట్రానికి తగిన సహాయం అందచేయాల్సిందిగా ఫెడరల్ ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు ఆయన తెలిపారు.

Read More : ICICI Bank Officers: క్యాన్సర్ పేషెంట్ డబ్బు లూటీ చేసిన ఐసీఐసీఐ బ్యాంకు ఆఫీసర్లు

Amazon warehouseలో సుమారు వంద మంది కార్మికులు లోపల చిక్కుకున్నారని స్థానిక మీడియా వెల్లడించింది. వీరిని కాపాడేందుకు శనివారం ఉదయం నుంచి సహాయక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఈ భవనంలో కొద్దిభాగం శిథిలావస్థకు చేరుకుందని అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. కూలిపోయిన భవనానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. Illinois State Police, Illinois ఎమర్జెన్సీ మేనేజ్ మెంట్ ఏజెన్సీలతో అధికారులు సమన్వయం చేసుకుంటూ…సహాయక చర్యలు కొనసాగిస్తున్నారని, తాను పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. Monette Manor nursing homeను టోర్నడో చుట్టుముట్టడంతో ఒకరు చనిపోయారని, 20 మంది చిక్కుకపోయినట్లు యూఎస్ మీడియా వెల్లడించింది. ఇందులో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీయడం జరిగిందని Craighead county అధికారి మార్విన్ డే తెలిపారు. కానీ…భవనం చాలా మటుకు ధ్వంసమైందన్నారు.