TTD : ఆకాశగంగ తీర్థ అభివృద్ధికి ఆనందసాయి సహకారం

ఆకాశగంగ తీర్థ అభివృద్ధికి డిజైన్ రూపొందించి పలు సలహాలు, సూచనలు చేశారు ఆనందసాయి. హనుమ జన్మస్థలంలో హనుమంతుడి భారీ విగ్రహ ఏర్పాటుకు టీటీడీ సన్నాహాలు చేస్తోంది...

TTD : ఆకాశగంగ తీర్థ అభివృద్ధికి ఆనందసాయి సహకారం

Ttd hanuman

Art Director Anand Sai : ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ ఆనందసాయిని తిరుపతికి రావాలని ఆహ్వానించింది టీటీడీ. టీటీడీ బోర్డు సమావేశంలో ఆయన పాల్గొన్నారు. హనుమ జన్మస్థలమైన ఆకాశగంగ తీర్థ అభివృద్ధికి సహకారం అందించాలని టీటీడీ పాలకమండలి కోరింది. ఈ సందర్భంగా…ఆకాశగంగ తీర్థ అభివృద్ధికి డిజైన్ రూపొందించి పలు సలహాలు, సూచనలు చేశారు ఆనందసాయి. హనుమ జన్మస్థలంలో హనుమంతుడి భారీ విగ్రహ ఏర్పాటుకు టీటీడీ సన్నాహాలు చేస్తోంది. గతేడాది లాగే ఈ ఏడాది కూడా 10 రోజుల పాటు వైకుంఠ ఏకాదశి వేడుకలు నిర్వహించాలని టీటీడీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అలాగే అంజనాద్రిని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలని టీటీడీ నిర్ణయించింది.

Read More : TTD Board Meeting : తిరుమలకు మూడో దారి…అన్నమయ్య మార్గంపై టీటీడీ ఫోకస్

ఇక ఆర్ట్ డైరెక్టర్ ఆనందసాయి విషయానికి వస్తే…సినిమాల్లో ఆర్ట్ డైరెక్టర్ గా గుర్తింపును తెచ్చుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా యాదాద్రి పునర్ నిర్మాణ పనుల్లో ఆనందసాయి కీలక పాత్ర పోషిస్తున్నారు. నిర్మాణానికి డిజైనర్ గా పనిచేస్తున్నారు. పలు రాష్ట్రాల్లో ఉన్న వైష్ణవ దేవాలయాలను ఆయన సందర్శించి..అక్కడ ఉన్న కళాకృతులను ఆయన పరిశీలించారు. కొన్ని డిజైన్లను తీసుకెళ్లి సీఎం కేసీఆర్ కు చూపించగా..ఒకే చెప్పడంతో…యాదాద్రి టెంపుల్ కు మొత్తం 4 వేల డిజైన్స్ ఇచ్చారు.

Read More : TTD : శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్..దర్శన టికెట్లు పెంచాలని నిర్ణయం

మరోవైపు…వచ్చే ఏడాది మార్చి 28 నాడు యాదాద్రిలో మహా కుంభ సంప్రోక్షణ జరుగుతుందని ఇటీవలే ప్రకటించారు సీఎం కేసీఆర్. మార్చి 21 నాడు ఆలయ అంకురార్పణతో మహా సుదర్శన యాగం మొదలవుతుందని చెప్పారు. 9 రోజుల పాటు అంకురార్పణ, మహా సుదర్శన యాగం, మహా కుంభ సంప్రోక్షణ కార్యక్రమాల్లో తెలుగు రాష్ట్రాలే కాకుండా.. ఇతర దేశాలు, రాష్ట్రాల నుంచి వందలాది వైష్ణవాలయ పూజారులు పాల్గొంటారన్నారు.