TTD Board Meeting : తిరుమలకు మూడో దారి…అన్నమయ్య మార్గంపై టీటీడీ ఫోకస్

భక్తుల ఇబ్బందుల దృష్య్టా అన్నమయ్య మార్గంపై లెటెస్ట్ గా దృష్టిసారించింది. అన్నమయ్య మార్గాన్ని అభివృద్ధి చేస్తే భక్తులకు ఇబ్బందులు తగ్గుతాయని ఆలోచిస్తోంది.

TTD Board Meeting : తిరుమలకు మూడో దారి…అన్నమయ్య మార్గంపై టీటీడీ ఫోకస్

Annamayya

Annamayya Margam : తిరుమలలో మూడో మార్గంపై టీటీడీ ఫోకస్ చేసింది. అన్నమయ్య మార్గాన్ని రోడ్డు, నడకమార్గంగా అభివృద్ధి చేయాలని టీటీడీ నిర్ణయించడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. 2021, డిసెంబర్ 11వ తేదీ శనివారం టీటీడీ బోర్డు సమావేశం జరిగింది. అన్నమయ్య మార్గంపై చర్చ జరిగింది. దీనిని అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అభివృద్ధి ప్రణాళికలు తయారు చేయాలని బోర్డు మీటింగ్ నిర్ణయం తీసుకుంది. ఇటీవలే తిరుమలలో ఎలాంటి వర్షాలు పడ్డాయో అందరికీ తెలిసిందే. తిరుమలలో ఎక్కడ చూసినా వరద నీటితో నిండిపోయింది. ప్రధానంగా ఘాట్ రోడ్డులు దెబ్బతిన్నాయి. దీంతో భక్తుల ఇబ్బందుల దృష్య్టా అన్నమయ్య మార్గంపై లెటెస్ట్ గా దృష్టిసారించింది. అన్నమయ్య మార్గాన్ని అభివృద్ధి చేస్తే భక్తులకు ఇబ్బందులు తగ్గుతాయని ఆలోచిస్తోంది.

Read More : TTD : శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్..దర్శన టికెట్లు పెంచాలని నిర్ణయం

పదకవితా పితామహుడు : –
పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యులు ఏడుకొండల వెంకటేశ్వరుని దర్శించుకునేందుకు నడయాడిన దారిని అన్నమయ్య కాలిబాటగా పిలుస్తారు. కడప జిల్లా రాజంపేట మండలంలోని తాళ్లపాక నుంచి అన్నమయ్య 500 ఏళ్ల క్రితం కాలినడకన తిరుమలకు వెళ్లేవారు. రైల్వే కోడూరు మండలంలోని కుక్కలదొడ్డి వద్ద నుంచి మెయిన్‌ రోడ్డు కుడిభాగంలో ఉన్న కాలిబాట గుండా ప్రయాణం చేస్తే తిరుమలకు చేరుకోవచ్చు. నాడు అన్నమయ్య నడిచిన దారిలో నేటికీ అనేక మంది భక్తులు తిరుమలకు వెళ్తూ ఉంటారు. ఈ దారిని అభివృద్ధి చేసినా.. భక్తులకు ఇబ్బందులు తగ్గుతాయనే వాదన కూడా ఒకటి ఉంది. తాజాగా దీనిపై టీటీడీ చర్చించి… అన్నమయ్య మార్గాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకుంది. రాయలసీమ, ఉత్తర భారతదేశం నుంచి వచ్చే వారికి ఈ మార్గం అనుకూలంగా ఉంటుందని వెల్లడిస్తున్నారు. అన్నమయ్య కాలిబాటకు మళ్లీ తిరుమల తిరుపతి దేవస్థానం చర్యలు తీసుకుంటున్నందుకు ఆనందపడుతున్నామన్నారు.