TTD : శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్..దర్శన టికెట్లు పెంచాలని నిర్ణయం

కొత్త ఏడాదిలో దర్శన టికెట్లు పెంచాలని నిర్ణయించడం జరిగిందని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు.

TTD : శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్..దర్శన టికెట్లు పెంచాలని నిర్ణయం

Ttd News

TTD Board Meeting : కొత్త ఏడాది కొద్ది రోజుల్లో రాబోతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది. కొత్త ఏడాదిలో దర్శన టికెట్లు పెంచాలని నిర్ణయించడం జరిగిందని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. సంక్రాంతి తర్వాత దర్శన  టికెట్లు పెంచడం జరుగుతుందన్నారు. రానున్న కొత్త సంవత్సరంలో శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు పునరుద్ధరణపై చర్చించామని, అందులో భాగంగా…కరోనా ఆంక్షలు సడలింపులు చేయాలని కేంద్రానికి ఉత్తరం రాయాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. 2021, డిసెంబర్ 11వ తేదీ టీటీడీ పాలకమండలి సమావేశం జరిగింది. అనంతరం తీసుకున్న నిర్ణయాలను టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మీడియాకు తెలియచేశారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా గత ఏడాదిలాగే పది రోజులు వైకుంఠ ద్వార దర్శనం కల్పించాలని, జనవరి 13 నుండి 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం ఉంటుందన్నారు. పద్మావతి పిల్లల ఆసుపత్రి నిర్మించాలని, అన్నమయ్య మార్గంలో రోడ్డు, నడకదారి నిర్మించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు.

Read More : Odisha : సెలవులు ఇవ్వడం లేదని తోటి విద్యార్థులకు విషం పెట్టాడు

వైకుంఠద్వార దర్శనానికి హరిజన, గిరిజన వాడల్లోని భక్తులకు అవకాశం కల్పించాలని, తిరుమలకు ఇప్పటికే రెండు ఘాట్ రోడ్లు ఉన్నా…అన్నమయ్య మార్గాన్ని సాంప్రదాయబద్ధంగా ఏర్పాటు చేయాలని అనుకున్నట్లు వెల్లడించారు. అన్నమయ్య నడిచిన మార్గాన్ని రోడ్డు మార్గం, నడక మార్గంగా అభివృద్ధి చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అన్నమయ్య మార్గం అభివృద్ధి కోసం ప్రణాళికలు తయారు చేయాలని పాలకమండలి నిర్ణయం తీసుకుంది.

Read More : Students Attack Teacher : చెత్త బ‌కెట్‌తో టీచర్‌ని దారుణంగా కొట్టిన స్కూల్ విద్యార్థులు

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తిరుమల తిరుపతిలో ధ్వంసం అయిన వాటికి వెంటనే మరమ్మతులు చేపట్టాలని, అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోయి కొట్టుకుపోయిన ఆలయాలు పునర్నిర్మించేందుకు సహకారం అందించాలని టీటీడీ పాలక మండలి పేర్కొంది. శ్రీశైలం శిఖర గోపురానికి టీటీడీ ఆధ్వర్యంలో బంగారు తాపడం పనులు చేయాలని పాలకమండలి ఒప్పుకుందన్నారు. ఎఫ్ఎంఎస్ కార్మికుల సమస్యల పరిష్కారానికి కమిటీ వేయడం జరిగినట్లు, తిరుమలలో సామాన్య భక్తులు బస చేసే అన్ని గదులకు మూడు కోట్ల రూపాయల వ్యయంతో వేడి నీటి గీజర్ లను ఏర్పాటు చేయాలని పాలకమండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నామన్నారు.