ICICI Bank Officers: క్యాన్సర్ పేషెంట్ డబ్బు లూటీ చేసిన ఐసీఐసీఐ బ్యాంకు ఆఫీసర్లు

తీవ్రమైన జబ్బుతో బాధపడుతున్న క్యాన్సర్ రోగి డబ్బులు లూటీ చేశారు బ్యాంకు ఉద్యోగులు. తమ బ్యాంకులో ఖాతా ఉన్న వ్యక్తి నుంచి ఐసీఐసీఐ బ్యాంక్ ఇద్దరు ఆఫీసర్లు రూ.19లక్షలు తమ ఖాతాల్లోకి...

ICICI Bank Officers: క్యాన్సర్ పేషెంట్ డబ్బు లూటీ చేసిన ఐసీఐసీఐ బ్యాంకు ఆఫీసర్లు

Fraud

ICICI Bank Officers: తీవ్రమైన జబ్బుతో బాధపడుతున్న క్యాన్సర్ రోగి డబ్బులు లూటీ చేశారు బ్యాంకు ఉద్యోగులు. తమ బ్యాంకులో ఖాతా ఉన్న వ్యక్తి నుంచి ఐసీఐసీఐ బ్యాంక్ ఇద్దరు ఆఫీసర్లు రూ.19లక్షలు తమ ఖాతాల్లోకి మార్చుకోవాలనుకున్నారు. సంతకం ఫోర్చరీ చేయడంతో పాటు అతని ఫిక్స్ డ్ డిపాజిట్లను పాలసీల్లోకి మార్చారు.

బాధితుడి 24ఏళ్ల కొడుకు ఫిర్యాదు మేరకు కేసు ఫైల్ చేయడంతో.. అను పాండే, శశికాంత్ ప్రసాద్ ల మోసాన్ని కొంద్వా పోలీసులు బయటపెట్టారు.

2019లో రిటైర్ అయిన తన తండ్రికి ఐసీఐసీఐలో అకౌంట్ ఉండేదట. పాస్ బుక్ అప్ డేట్ చేసుకోవడం కోసం బ్యాంకు వెళ్లేసరికి.. నిందితులు ఫిక్స్‌డ్ డిపాజిట్ అమౌంట్‌ను మ్యూచువల్ ఫండ్స్, పాలసీల్లోకి మార్చుకోవాలని సూచించారట. ఆ తర్వాత సంతకాన్ని ఫోర్జరీ చేసి వాళ్లకు అనుగుణంగా మార్చేసుకున్నారు.

………………………..: ‘నేనున్నంత వరకూ ఆర్మీలోనే ఉండు సాయితేజ’ – బిపిన్ రావత్

నిందితులపై చీటింగ్ 420 సెక్షన్, ఫోర్జరీ 468 సెక్షన్, తప్పుడు సర్టిఫికేషన్ 471 ప్రకారం.. కేసులు నమోదు చేశారు. ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుందని పోలీసులు తెలిపారు.