ప్రపంచ వ్యాప్తంగా ఉండే మొత్తం కరోనా వైరస్ ఒక్క స్పూను ఉంటుందంట!

  • Published By: nagamani ,Published On : November 16, 2020 / 01:54 PM IST
ప్రపంచ వ్యాప్తంగా ఉండే మొత్తం కరోనా వైరస్ ఒక్క స్పూను ఉంటుందంట!

Australia mathematician corona virus fits in teaspoon : చైనాలో పుట్టిందని చెబుతున్న కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచ దేశాల్నే గడగడలాడించేస్తోంది. ప్రజలు గుండెలు గుప్పిట్లో పెట్టుకుని మొహాలకు మాస్కులు కట్టుకుని జీవిస్తున్నారు. ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలన్ని ఛిన్నాభిన్నం చేసేసి..ప్రజల్ని రోడ్డున పడేసి విలాసంగా వికటాట్టహాసం చేస్తోంది కరోనా మహమ్మారి.



ఈ కరోనా వైరస్ పరిమాణంలో అతి సూక్ష్మమైనా ప్రపంచాన్ని అల్లకల్లో చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఉండే ఈ వైరస్ మొత్తం చూస్తే కేవలం ఒకే ఒక్క ‘టీ స్పూన్’ పరిమాణంలో మాత్రమే ఉంటుందని ఆస్ట్రేలియా నిపుణుడు ఆసక్తికర అంశాలు వెల్లడించారు. కరోనా రక్కసి ప్రజల ఆరోగ్యంపైనే కాదు, సామాజిక, ఆర్ధిక జీవనంపైనా పెను ప్రభావం చూపిస్తోంది.




ఈ క్రమంలో గణితంతో మ్యాజిక్కులు చేసే మాట్ పార్కర్ అనే ఆస్ట్రేలియా నిపుణుడు కరోనా వైరస్ గురించి పలు ఆసక్తికర అంశాలు వెల్లడించారు. ప్రపంచంలో ఉన్న కరోనా వైరస్ మొత్తాన్ని పోగు చేస్తే అది ఓ ‘టీస్పూను’లో సరిపోతుందని పార్కర్ చెబుతున్నారు. ఇది విన్నవారంతా ఆశ్యర్యపోతున్నారు.
https://10tv.in/vexas-new-life-threatening-disease-causing-clot-and-death-in-men-discovered-by-scientists/


ప్రపంచ మానవాళిని పట్టిపీడిస్తున్న కరోనా వైరస్ మొత్తం పరిమాణం మహా అయితే ‘‘8 ML’ ఉంటుందని, ఓ టీస్పూనులో 6 ML పడుతుందని వివరించారు మాట్ పార్కర్. కరోనా వైరస్ కణం చాలా చిన్నదని..అతి సూక్ష్మమైనదనీ..కానీ అది మాత్రం ప్రపంచవ్యాప్తంగా 53 మిలియన్లకు పైగా కేసులు నమోదు అయిన క్రమంలో తాను గణించిన మేరకు అది ఓ స్పూనుకు కొంచెం ఎక్కువ ఉంటుందేమో అని తెలిపారు. ఓ టీస్పూన్ వైరస్ తో ఇంత పెద్ద ప్రపంచం కష్టపడుతోందని మాట్ పార్కర్ నమ్మశక్యంకాని విషయాన్ని వెల్లడించారు.



కాగా..కరోనా వైరస్ కణం మానవ కణాల కంటే పది లక్షల రెట్లు చిన్నది. ఆ లెక్కన ఇప్పుడున్న కేసుల ఆధారంగా ప్రపంచంలో 3.3 మిలియన్ బిలియన్ల కొవిడ్-19 కణాలు ఉన్నాయని మాట్ పార్కర్ పేర్కొన్నారు. ఇంత చిన్న పరిమాణంలో ఉండే ఈ మహమ్మారి ప్రంపంచాన్ని కకావికలం చేసి పారేస్తోందని అన్నారు. రోజుకు మూడు లక్షల కేసులు నమోదవుతున్నాయి. కాగా ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు 5 కోట్ల 43 లక్షల 12వేలకు పైగా చేరుకున్నాయి. మృతుల సంఖ్య 13లక్షల 17వేల 366కు చేరుకుంది.