పాక్ మాజీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు :అక్కడ రక్షణ లేదు..భారత్‌లోనే ఉంటాం

  • Published By: veegamteam ,Published On : September 10, 2019 / 09:14 AM IST
పాక్ మాజీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు :అక్కడ రక్షణ లేదు..భారత్‌లోనే ఉంటాం

పాకిస్థాన్ మాజీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ దేశంలో హిందువుల్ని, సిక్కులను హింసిస్తున్నారంటూ పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ పార్టీ అయిన పాకిస్థాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే బల్దేవ్ కుమార్  సంచలన వ్యాఖ్యలు చేశారు.

పాక్‌లో మైనారిటీలనే కాకుండా ముస్లింలకు కూడా రక్షణ లేదనీ ఆరోపించారు.ప్రతీ రోజు చాలా కష్టాలు ఎదుర్కొవలస వస్తోందన్నారు. పాకిస్థాన్ లో తాము పలు కష్టాలు పడ్డామని..తనకు భారత ప్రభుత్వం ఆశ్రయం కల్పిస్తే తాను మళ్లీ పాకిస్థాన్ కు వెళ్లనని బల్దేవ్ కుమార్ తెలిపారు. 

దేశంలోని ఖైబర్ ఫక్తూన్ ఖవా పరిధిలోని బారికట్ మాజీ ఎమ్మెల్యే అయిన బల్దేవ్ కుమార్ తన కుటుంబంతో కలిసి మూడు నెలల వీసాపై ఆగస్టు 12న భారత్ వచ్చారు. బల్దేవ్ భారత్ కు వచ్చే కొన్ని నెలల ముందు అతని భార్య,ఇద్దరు పిల్లలను పంజాబ్ లోని లుధియానా ఖన్నాలోని వారి బంధువుల ఇంటికి పంపారు. పాకిస్థాన్ లో మతపరమైన మైనారిటీలు హింసించబడుతున్నందున తన కుటుంబాన్ని కాపాడుకునేందు తన కుటుంబాన్ని పాకిస్థాన్ నుంచి భారత్ కు తరలించాల్సి వచ్చిందని ఆయన వాపోయారు. కానీ భారత్ ప్రభుత్వం అనుమతి ఇస్తే శాశ్వతంగా ఇక్కడే ఉండిపోవాలనుకుంటున్నామనీ తిరిగి పాక్ వెళ్లమని దానికి భారత్ ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని కోరారు. 

పాకిస్థాన్ లో ఉన్న హిందువులు, సిక్కులు పలురకాలుగా హింసకు గురవుతున్నారని..అటువంటి బాధిత కుటుంబాలు పాక్ నుంచి భారతదేశానికి తిరిగివచ్చేందుకు వీలు కల్పించాలని కోరారు.దీనికి సంబంధించి భారత్ ప్యాకేజీని ప్రకటించాలని, దీనిపై ప్రధానమంత్రి మోదీ ఏదైనా చేయాలని బల్దేవ్ కుమార్ కోరారు. పాకిస్థాన్ లో హిందువులు, సిక్కులు, క్రైస్తవ బాలికలను బలవంతంగా ఇస్లాంలోకి మార్చి ముస్లిమ్ యువకులు పెళ్లాడుతున్న ఘటనలు నిత్యం జరుగుతున్నాయని బల్దేవ్ కుమార్ తెలిపారు. నంకాన సాహిబ్ వద్ద ఓ సిక్కు బాలికను బలవంతంగా మతం మార్చి ముస్లిమ్ యువకుడు పెళ్లాడిన ఘటన  జరిగిందనీ..ఇదీ పాక్ అరాచకానికి నిదర్శనమని బల్దేవ్ వివరించారు.