Communal Violence: హిందువులపై హింస.. తాలిబాన్ల హస్తం.. ప్రభుత్వాన్ని పడగొట్టడానికే!

బంగ్లాదేశ్‌లో మైనారిటీలైన హిందువులపై హింస పెరుగుతుందని బంగ్లాదేశ్ ప్రభుత్వం ఒప్పుకుంది.

Communal Violence: హిందువులపై హింస.. తాలిబాన్ల హస్తం.. ప్రభుత్వాన్ని పడగొట్టడానికే!

Violence

Communal Violence: బంగ్లాదేశ్‌లో మైనారిటీలైన హిందువులపై హింస పెరుగుతుందని బంగ్లాదేశ్ ప్రభుత్వం ఒప్పుకుంది. అయితే, హిందువుల భద్రతకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ఆరోపణలపై అరెస్టులు చేస్తున్నట్లుగా ప్రభుత్వం చెబుతోంది. ఈ హింసను ఆపడానికి ప్రయత్నాలు చేస్తున్నామని, ఈ దాడులకు తాలిబాన్లకు సంబంధం ఉన్నట్లుగా ఆరోపించింది బంగ్లాదేశ్ ప్రభుత్వం.

ఈ హింస వెనుక తాలిబాన్లు, పాకిస్తాన్ హస్తం ఉండొచ్చని మాజీ సమాచార మంత్రి, బంగ్లాదేశ్ పార్లమెంట్ స్పీకర్ హసనుల్ హక్ అన్నారు.

హింసతో తాలిబాన్లకు సంబంధాలు:
హింసలో తాలిబాన్లకు ప్రమేయం ఉందని అనుమానం వ్యక్తం చేసిన బంగ్లాదేశ్ పార్లమెంట్ స్పీకర్ హసనుల్ హక్.. గతంలో తాలిబాన్ అంటే ఒసామా బిన్ లాడెన్‌తో సంబంధం ఉన్నవారిలో చాలా మంది ఇప్పుడు అదుపులో ఉన్నారని చెప్పారు. ఆఫ్ఘనిస్తాన్‌లో ఉన్నవారి అనుచరులు షేక్ హసీనా లౌకిక ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని పడగొట్టడానికి, తాలిబాన్లను అధికారంలోకి తీసుకునివచ్చి దేశాన్ని అస్థిరపరిచే కుట్ర చేస్తున్నట్లు చెప్పారు.

విదేశీ దుర్మార్గపు సంస్థ తాలిబాన్లు రహస్యంగా చేస్తున్న పనులను చూస్తున్నామని, గత 12-13 సంవత్సరాలుగా దేవాలయాలపై మాత్రమే కాకుండా సూఫీలు, సహచరులు, సమాధులు, బౌద్ధ మఠాలు, మేధావులు, రచయితలు మరియు ముస్లింలపై కూడా దాడులు జరుగుతున్నాయని, నాయకులు, ఇమామ్‌లపై దాడులు జరిగాయని అన్నారు.

బంగ్లాదేశ్‌లోని నోఖాలీలో ఇస్కాన్ ఆలయంపై దాడితో వివాదం స్టార్ట్ అవ్వగా.. అక్టోబర్ 15వ తేదీన, వందలాది మంది అల్లరి మూకలు ఇక్కడి ఇస్కాన్ దేవాలయంలోకి ప్రవేశించి దోపిడీకి, కాల్పులకు దిగారు. ఇక్కడ ఇస్కాన్ సొసైటీ వ్యవస్థాపకుడు ఎసి భక్తివేదాంత స్వామి ప్రభుపాద విగ్రహం ఉంది. అల్లర్లలో విగ్రహం చేతులను నరికివేసి, ఆపై నిప్పు పెట్టారు. ఇక్కడ జగన్నాథుడి రథానికి కూడా నిప్పు పెట్టారు.