Small Cow : ఆవుతో సెల్ఫీ.. ఆందోళనలో అధికారులు

Small Cow : ఆవుతో సెల్ఫీ.. ఆందోళనలో అధికారులు

Small Cow

Small Cow : ఆవుల్లో చిన్నగా ఉండే జాతి ఏదంటే పుంగనూరు అని టక్కున చెప్పేస్తారు. పుంగనూరు ఆవులు భారత దేశంలో అత్యంత చిన్నవి. అయితే పుంగనూరు అవుకంటే చిన్న ఆవు బంగ్లాదేశ్ లో ఒకటి ఉంది. ఆ ఆవు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దానిని చూసేందుకు ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారు. దీంతో అక్కడి అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వివరాల్లోకి వెళితే బంగ్లాదేశ్​ రాజధాని ఢాకా శివార్లలోని శికోర్​ ఆగ్రో ఫామ్​లో రాణి అనే అవు ఉంది. ఇది ప్రపంచంలోనే అతి చిన్న ఆవు.. దీని ఎత్తు కేవలం 26 అంగుళాలు మాత్రమే. గిన్నిస్ బుక్ రికార్డులలో ప్రస్తుతం ఉన్న చిన్న ఆవుకన్నా ఇది నాలుగు అంగుళాలు చిన్నగా ఉందని ఆవు రాణి యజమాని చెబుతున్నాడు.

గిన్నిస్​ బుక్​ ఆఫ్​ వరల్డ్​ రికార్డుల్లో స్థానం కోసం దరఖాస్తు చేసినట్లు రాణి యజమాని వివరించారు. అయితే ఈ ఆవు జన్యులోపం కారణంగా ఎదుగుదల లోపించిందని ఇంతకూ మించి ఎత్తు పెరగదని వైద్యులు చెబుతున్నారు. ఇక ఈ అవును చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తున్నారు. అంతటితో ఆగకుండా ఆవుతో సెల్ఫీ దిగేందుకు ఎగబడుతున్నారు.

దీంతో ఆ ప్రాంతంలో కోవిడ్ హాట్ స్పాట్ గా మారింది. ప్రజలను చూసి ఆవు యజమాని ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. తాను చేసిన ప్రకటన వల్లనే ప్రజలకు ఈ విషయం తెలిసిందని.. లేదంటే ఈ చిన్న ఆవు గురించి తెలిసేది కాదని చెబుతున్నాడు. కరోనా సమయంలో ఇలా రావడంతో మంచిది కాదని చెప్పిన ప్రజలు వినడం లేదని .. మూడు రోజుల్లోనే సుమారు 15 వేలమంది వచ్చారని వివరించారు. ప్రజలకు చెప్పినా వినడం లేదని ఆయన వాపోయారు.

ఇదిలా ఉంటే బంగ్లాదేశ్ లో కరోనా కేసుల తీవ్రత అధికంగా ఉంది. జూన్ నెలలో కేసుల సంఖ్య పెరగడం మరణాలు అధికంగా నమోదవడంతో అక్కడ లాక్ డౌన్ విధించారు. అయితే ఈ అవును చూసేందుకు లాక్ డౌన్ నిబంధనలు కూడా ఉల్లగిస్తున్నారు ప్రజలు. దీంతో ఆ ప్రాంతంలో కరోనా కేసులు అధికంగా నమోదవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.