అదో వెరైటీ : స్పైడర్ మాన్ గెటప్ తో ఆఫీసుకొచ్చిన బ్యాంక్ ఉద్యోగి

  • Published By: venkaiahnaidu ,Published On : January 31, 2019 / 02:23 AM IST
అదో వెరైటీ :  స్పైడర్ మాన్ గెటప్ తో ఆఫీసుకొచ్చిన బ్యాంక్ ఉద్యోగి

బ్యాంక్ ఉద్యోగులు సాధారణంగా దుస్తుల విషయంలో పద్దతిగా నడుచుకుంటారు. అయితే ఓ బ్యాంక్ ఉద్యోగి మాత్రం తన ఢిఫరెంట్ స్టైల్ ని ప్రదర్శించాడు. అతడి డ్రెస్ చూసిన అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. బ్యాంకుకి ఇలా కూడా వస్తారా అని నవ్వేసుకుంటున్నారు.
ఆగ్నేయ బ్రెజిల్ ప్రాంతంలోని సావో పౌల్ లోని ఓ బ్యాంక్ లో ఉద్యోగిగా పని చేస్తున్న ఓ యువకుడు ఇటీవల తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు. చివరి వర్కింగ్ డే రోజున మంగళవారం(జనవరి 29, 2019)  స్పైడర్ మేన్ అవతారంతో బ్యాంక్ కు వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అతడి స్పైడర్ అవతారాన్ని చూసి అవాక్కైన సహ ఉద్యోగులు అతడితో కలిసి సెల్ఫీలు తీసుకొన్నారు. స్పైడర్ మేన్ వేషధారణలోనే తన విధులను నిర్వహించాడు ఆ యువకుడు. అందరికీ స్వీట్లు పంచాడు. లాస్ట్ వర్కింగ్ డే రోజున ఇష్టమొచ్చిన డ్రెస్ తో ఆఫీసుకి వచ్చే వెసులుబాటును కల్పించినట్లు బ్యాంక్ అధికారులు తెలిపారు. స్పైడర్ బ్యాంకర్ సంబంధించిన 51 సెకన్ల నిడివిగల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.