Queen Elizabeth : క్వీన్ ఎలిజ‌బెత్ మరణం .. ఆమె ముద్ర ఉన్న 95 బిలియ‌న్ల డాల‌ర్ల నోట్లు చెల్లుతాయా లేదా? బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ ఏం చెబుతోంది?

క్వీన్ ఎలిజ‌బెత్ మరణం .. ఆమె ముఖం ముద్ర ఉన్న 95 బిలియ‌న్ల డాల‌ర్ల నోట్లు చెల్లుతాయా లేదా అనే విషయం ఆసక్తికరంగా మారింది. దీనిపై బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ ఏం చెబుతోందంటే..

Queen Elizabeth : క్వీన్ ఎలిజ‌బెత్ మరణం .. ఆమె ముద్ర ఉన్న 95 బిలియ‌న్ల డాల‌ర్ల నోట్లు చెల్లుతాయా లేదా? బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ ఏం చెబుతోంది?

Banknotes With The Queen's Elizabeth Face

Banknotes With The Queen’s Elizabeth Face : క్వీన్ ఎలిజబెత్ మ‌ర‌ణంతో గ్రేట్ బ్రిటన్ లో పలు మార్పులు చోటుచేసుకోనున్నట్లుగా తెలుస్తోంది. పాలన ఆమె కుమారుడు చేతిలోకి వెళ్లటమే కాదు..దశాబ్దాలుగా క్వీన్ ఎలిజబెత్ ముద్రను తనదైనశైలిలో పాలన చూపించటం రాజు చార్లెస్ కు కత్తిమీద సాము అనే చెప్పాలి. ఎందుకంటే అత్యంత అసాధారణ పాలన క్వీన్ ఎలిజబెత్ సొంతం. ముఖ్యంగా బ్రిటన్ కరెన్సీ నోట్లపై క్వీన్ ఎలిజబెత్ ముద్ర ఇప్పుడు బ్రిటన్ లో ఆసక్తికరంగా మారింది.

ఆమె ముద్ర ఉన్న కరెన్సీ చెల్లుతుందా? లేదా? కరెన్సీ నోట్ల డిజైన్ మారుస్తారా? ఆమె ముఖం ముద్ర ఉన్న కరెన్సీ మారనుందా? అనే విషయాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. క్వీన్ ఎలిజబెత్ మరణం తరువాత బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ క‌రెన్సీ నోట్ల‌పై గంద‌ర‌గోళం నెలకొంది. ఆ నోట్లు చెల్లుతాయా? లేదా? ఈ అంశంపై బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ ఓ ప్రకటన విడుదల చేసింది. క్వీన్ ఎలిజబెత్ అధికారిక సంతాప దినం ముగిసిన తర్వాత..ప్రస్తుత నోట్లను మార్చే ప్రణాళికలను గురించి వివరిస్తామని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ తెలిపింది.

Queen Elizabeth Letter : సిడ్నీ ప్రజలకు క్వీన్ ఎలిజబెత్ రాసిన సీక్రెట్ లెటర్ .. 2085వ సంవత్సరంలో తెరవాలని నిబంధన

క్వీన్ ఎలిజ‌బెత్ ముద్ర ఉన్న నోట్లు, నాణాలు చెలామ‌ణి అవుతాయ‌ని సెప్టెంబ‌ర్ 9వ తేదీన బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ ప్ర‌క‌ట‌న చేసింది. అయితే క్వీన్ అంత్య‌క్రియ‌లు పూర్తి అయిన ఏడు రోజుల త‌ర్వాత క‌రెన్సీ నోట్లపై మ‌రోసారి అధికార‌క ప్ర‌క‌ట‌న చేస్తామని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ వెల్లడించింది. సెప్టెంబ‌ర్ 19వ తేదీన ఎలిజ‌బెత్ పార్దీవ‌దేహానికి అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించ‌నున్నారు.

కామ‌న్‌వెల్త్‌లో మొత్తం 54 దేశాలు ఉన్నాయి. అయితే ఆ దేశాల్లో వాడుతున్న క‌రెన్సీ నోట్ల‌పై క్వీన్ ఎలిజబెత్ ముద్ర ఉంది. అయితే బ్యాంక్ నోట్ల‌ను ప్రింట్ చేసే రాయ‌ల్ మింట్‌కు ఇప్పుడో పెద్ద టాస్క్ వ‌చ్చి ప‌డింది. రాణి బొమ్మ ఉన్న నోట్ల‌ను, నాణాల‌ను తొల‌గించి వాటి స్థానంలో కింగ్ ఛార్లెస్-3 ముద్ర‌తో నోట్ల‌ను, నాణాల‌ను జారీ చేయాల్సి ఉంటుంది. ప్ర‌స్తుతం ఇంగ్లండ్‌లో సుమారు 4.7 మిలియ‌న్ల బ్యాంక్ నోట్లు చెలామ‌ణిలో ఉన్నాయి. ఆ నోట్ల విలువ సుమారు 95 బిలియ‌న్ల డాల‌ర్లు ఉంటుంద‌ని అంచ‌నా. రాయ‌ల్ మింట్ లెక్క ప్ర‌కారం.. 29 మిలియ‌న్ల నాణాలు కూడా చెలామ‌ణిలో ఉన్న‌ట్లుగా తెలుస్తోంది.

King Charles : తల్లి క్వీన్ ఎలిజబెత్ మరణం .. కింగ్ చార్లెస్ పాలనపై సర్వత్రా ఆసక్తి..

కొత్త క‌రెన్సీ నోట్ల‌ను త్వ‌ర‌లో ప్ర‌వేశ‌పెట్టే అవ‌కాశాలు ఉన్నాయి. అయితే కొత్త వాటితో పాటు రాణి ముద్ర ఉన్న పాత నోట్ల‌ను కూడా కొన్నాళ్ల పాటు వినియోగించే అవ‌కాశాలు ఉన్నాయి. ఛార్లెస్ ముద్ర ఉన్న నాణాల‌ను బ్రిట‌న్‌లోని రాయ‌ల్ మింట్ ప్రింట్ చేయ‌నున్నారు.