Richard Verma: భారత సంతతి వ్యక్తికి జో బైడెన్ కీలక పదవి.. అమెరికా డిప్యూటీ సెక్రెటరీగా రిచర్డ్ వర్మ

భారత సంతతి వ్యక్తికి అమెరికాలో మరో కీలక పదవి లభించింది. ఇండియన్-అమెరికన్ లాయర్ అయిన రిచర్డ్ వర్మను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దేశ డిప్యూటీ సెక్రెటరీగా నియమించారు.

Richard Verma: భారత సంతతి వ్యక్తికి జో బైడెన్ కీలక పదవి.. అమెరికా డిప్యూటీ సెక్రెటరీగా రిచర్డ్ వర్మ

Richard Verma: భారత సంతతికి చెందిన వ్యక్తికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక పదవి ఇచ్చారు. ఇండియన్-అమెరికన్ లాయర్ అయిన రిచర్డ్ వర్మను జో బైడెన్ దేశ డిప్యూటీ సెక్రెటరీగా నియమించారు. రిచర్డ్ వర్మను శుక్రవారం బైడెన్ నామినేట్ చేసినట్లు వైట్ హౌజ్ వర్గాలు తెలిపాయి. ఇది అమెరికా దౌత్య విభాగానికి సంబంధించిన అత్యున్నత పదవి.

Chanda Kochhar: అక్రమ రుణ మంజూరు కేసులో ఐసీఐసీఐ మాజీ సీఈవో చందా కొచ్చర్ దంపతుల అరెస్ట్

ఈ నియామకం పూర్తైతే ఆయన అమెరికా మేనేజ్‌మెంట్, రిసోర్సెస్ విభాగానికి డిప్యూటీ సెక్రెటరీగా వ్యవహరిస్తారు. దీని ద్వారా అమెరికా ప్రభుత్వంలో సేవలందిస్తున్న భారత సంతతి వ్యక్తుల్లో అత్యంత పెద్ద పదవి అందుకున్న వ్యక్తిగా రిచర్డ్ వర్మ నిలుస్తారు. గతంలో రిచర్డ్ వర్మ భారత రాయబారిగా కూడా పని చేశారు. జనవరి 16, 2015 నుంచి జనవరి 20, 2017 వరకు ఆయన ఇండియాలో అమెరికా రాయబారిగా సేవలందించారు. ప్రస్తుతం రిచర్డ్ వర్మ మాస్టర్ కార్డ్ సంస్థ, గ్లోబల్ పాలసీకి చీఫ్ లీగల్ ఆఫీసర్‌గా పని చేస్తున్నాడు.

గతంలో ఒబామా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కూడా రిచర్డ్ వర్మ అక్కడి ప్రభుత్వంలో పని చేశారు. లెజిస్లేటివ్ అఫైర్స్‌ విభాగానికి అసిస్టెంట్ సెక్రెటరీగా పని చేశారు. అంతేకాకుండా అమెరికాకు సంబంధించిన కీలక విభాగాల్లో పని చేశారు. రిచర్డ్ వర్మ న్యాయశాస్త్రంలో పీహెచ్.డి.పూర్తి చేశారు.