అమెరికన్ ఎలక్ట్రిక్ వాహనాలనే వాడదాం.. ప్రభుత్వ ఇందన వాహనాలన్నీ మార్చేస్తాం : బైడెన్ పిలుపు

అమెరికన్ ఎలక్ట్రిక్ వాహనాలనే వాడదాం.. ప్రభుత్వ ఇందన వాహనాలన్నీ మార్చేస్తాం : బైడెన్ పిలుపు

Biden government fleet with electric vehicles : అమెరికన్ ఎలక్ట్రిక్ వాహనాలనే వాడదామని అమెరికా కొత్త అధ్యక్షుడు పిలుపునిచ్చారు. అమెరికన్లు తయారుచేసిన ఎలక్ట్రిక్ వాహనాలనే కొనాలని ఆయన ట్వీట్ చేశారు. తమ ఫెడరల్ ప్రభుత్వం కూడా గ్యాస్ తో నడిచే వాహనాల వాడకాన్ని దశల వారీగా తొలగించనున్నట్టు తెలిపారు. ఇందన వాహనాల స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాలతో భర్తీ చేయనున్నట్టు బైడెన్ పేర్కొన్నారు.  టెస్లా, రివియన్, లార్డ్‌స్టౌన్ వంటి అమెరికాకు చెందిన ఈవీ వెహికల్స్ మేకర్లు, అలాగే ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిలో అగ్రగామి అయిన ఫోర్డ్ జనరల్ మోటార్స్ వంటి లెగసీ వాహన తయారీదారులకు ఎక్కువ లబ్దిచేకూరనుంది.

జనరల్ సర్వీసెస్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం.. 2019 నాటికి, ఫెడరల్ ప్రభుత్వ దాదాపు 650,000 వాహనాలు ఉన్నాయి. ఇందులో 245,000 సివిల్ వెహికల్స్, 173,000 సైనిక వాహనాలు, 225,000 పోస్ట్ ఆఫీస్ వాహనాలు ఉన్నాయి. 2019 లో 4.5 బిలియన్ మైళ్ల వరకు ఈ వాహనాలన్నీ ప్రయాణించాయి. గ్యాస్ కార్లను ఎలక్ట్రిక్ వాహనాలతో భర్తీ చేయడానికి వినియోగదారులకు రిబేటులు లేదా ప్రోత్సాహకాలను అందించే వ్యవస్థను రూపొందిస్తానని బిడెన్ హామీ ఇచ్చారు. గ్యాస్ కార్లను ఎలక్ట్రిక్ వాహనాలతో భర్తీ చేయాలన్న బైడెన్.. అమెరికా వినియోగదారులకు రాయితీలు ఇస్తానని హామీ ఇచ్చారు.

ఎలక్ట్రిక్ వాహనాల కోసం, 7,500 డాలర్లు ఫెడరల్ టాక్స్ క్రెడిట్‌కు తాను మద్దతు ఇస్తున్నానని అన్నారు. అలాగే కారు కొనుగోలుదారులను ఎలక్ట్రిక్‌కు మార్చడాన్ని ప్రోత్సహించడానికి కొత్త ప్రోత్సాహకాలను అందించనున్నట్టు  బైడెన్ చెప్పారు.  మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన 2020 బడ్జెట్ ప్రతిపాదనలో ఫెడరల్ ఈవీ టాక్స్ క్రెడిట్‌ను ఎత్తేసేందుకు ప్రయత్నించినప్పటికీ విజయవంతం కాలేదు.