UAE Working Week : వారానికి 2.5 రోజులు సెలవు..యూఏఈ మరో కీలక నిర్ణయం

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(UAE) ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఉద్యోగులకు వారంలో మొత్తం 4.5 రోజులు మాత్రమే పనిదినాలు ఉంటాయని మంగళవారం యూఏఈ ప్రకటించింది. ఇప్పటివరకు యూఏఈలో

UAE Working Week : వారానికి 2.5 రోజులు సెలవు..యూఏఈ మరో కీలక నిర్ణయం

Uae

UAE Working Week : యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(UAE) ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఉద్యోగులకు వారంలో మొత్తం 4.5 రోజులు మాత్రమే పనిదినాలు ఉంటాయని మంగళవారం యూఏఈ ప్రకటించింది. ఇప్పటివరకు యూఏఈలో శుక్ర,శనివారం సెలవు రోజులుగా ఉండగా…తాజా నిర్ణయంతో జనవరి-1,2022 నుంచి వారతంపు సెలవులు శుక్రవారం మధ్యాహ్నాం 12 గంటల నుంచే ప్రారంభమవుతాయి.

2006కి ముందు యూఏఈలో గురువారం,శుక్రవారం సెలవు రోజులుగా ఉండేవి. ఆ తర్వాత ప్రేవేట్ కంపెనీల రాకతో శుక్ర,శనివారాలను సెలవు దినాలుగా ప్రకటించారు. ఇప్పుడు గ్లోబల్ మార్కెట్లతో అనుసంధానం అయ్యేందుకు వీలుగా శుక్రవారం మధ్యాహ్నాం నుంచే వారాంతపు సెలవులను ప్రవేశపెట్టారు.

శని,ఆదివారాలను సెలవుగా పాటించే దేశాలతో ఆర్థిక లావాదేవీలు సజావుగా జరిగేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూఏఈ తెలిపింది. ఈ నిర్ణయంతో దేశంలో పనిచేసే వేలకొద్దీ అంతర్జాతీయ కంపెనీల లావాదేవీలు మరింత సరళంగా జరుగుతాయని తెలిపింది.

దేశ ఆర్థిక పోటీతత్వాన్ని పెంపొందించడానికి పనితీరును పెంచుతూనే, పని-జీవితం మధ్య సమతుల్యతను పెంచడానికి మరియు సామాజిక శ్రేయస్సును మెరుగుపరచడానికి UAE ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూఏఈ అధికారిక మీడియా తెలిపింది. కాగా, జాతీయ పని వారాన్ని…ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐదు రోజుల వారం కంటే తక్కువగా ప్రవేశపెట్టిన ప్రపంచంలోనే మొదటి దేశంగా యూఏఈ నిలిచింది.

ALSO READ UP Election : ఎర్ర టోపీలు యూపీకి రెడ్ అలర్ట్..స‌మాజ్‌వాది పార్టీపై మోదీ ఫైర్