94 yrs women wedding gown : 94 ఏళ్లకు ‘పెళ్లి గౌను’ కోరిక నెరవేర్చుకున్న బామ్మ

కొన్ని చిన్ని చిన్ని కోరికలు తీర్చుకోవాలంటే ఒకోసారి దశాబ్దాలే పటొచ్చు. అదే జరిగింది ఓ బామ్మ విషయంలో. తన పెళ్లికి సొంతంగా గౌను కొనుక్కుని వేసుకోవాలని. ఆ కోరికను తన 94 ఏళ్ల వయస్సులో తెల్లటి పెళ్లి గౌను వేసుకుని మురిసిపోయిన బామ్మ వైరల్ గా మారింది.

94 yrs women wedding gown : 94 ఏళ్లకు ‘పెళ్లి గౌను’ కోరిక నెరవేర్చుకున్న బామ్మ

94 Yrs Women Wedding Gown

Birmingham 94 year old women wedding gown : కొన్ని చిన్ని చిన్ని కోరికలు తీర్చుకోవాలంటే ఒకోసారి దశాబ్దాలే పటొచ్చు. ఒక్కోసారి జీవిత కాలం కూడా పట్టొచ్చు. అదే జరిగింది ఓ బామ్మ విషయంలో. ఆ బామ్మగారిది చాలా చిన్న కోరిక. తన పెళ్లికి సొంతంగా గౌను కొనుక్కుని వేసుకోవాలని. తెల్లని గౌను వేసుకుని వధువుగా ముస్తాబు అయ్యి పెళ్లి వేదికపైకి నడిచి రావాలని. కానీ ఆ చిన్న కోరిక కూడా ఆమెకు నెరవేరలేదు. దానికి కారణాలు చాలానే ఉన్నాయి. ఒకరకంగా చెప్పాలంటే ఆ కారణాలు ‘జాతివివక్ష’కు సంబంధించినవి. ఆ వివక్ష కారణంగా ఆమె తన పెళ్లిలో గౌను వేసుకుని వేదికమీదకు రావాలనే కోరిక తన 94 ఏళ్ల వయస్సు వచ్చేవరకూ తీరలేదు. తన మనుమరాలి వల్ల బామ్మ తన 94ఏళ్ల వయస్సులో తెల్లటి గౌను వేసుకుని మురిసిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మార్తా మే ఓపేలియా మూన్‌ టక్కర్‌ అనే 94 ఏళ్ల బామ్మ ఇంగ్లండ్‌లోని బ‌ర్మింగ్‌హామ్‌లో నివసిస్తుంది. త‌న పెళ్లిలో తెల్ల‌ గౌను ధ‌రించాల‌ని ఆమెకు క‌ల. త‌న పెళ్లికి సొంతంగా గౌను కొనుక్కొని వేసుసుకోవాల‌ని క‌ల‌లకు ఆనాటి ప‌రిస్థితులు అడ్డుగా నిలిచాయి. మూన్‌ టక్కర్‌ చేతిలో గౌను కొనుక్కోవటానికి సరిపడా డ‌బ్బు ఉన్నా..జాతి వివ‌క్ష ఆమెను గౌను కొన‌నివ్వ‌లేదు. ఆమె కలను జాతి వివక్ష అడ్డుకుంది. దీంతో ఆమె కల అలాగే ఉండిపోయింది. ఆమె జీవితంలో ఎన్నో దశాబ్దాలు గడిచిపోయాయి. కానీ ఆమె ఆ చిన్న కలమాత్రం నెరవేరలేదు. అలా ఆమెకు 94 ఏళ్లు వచ్చేశాయి. ఈ మధ్యలో ఆమె ఎన్నో పెళ్లిళ్లు చూసింది. ఆ పెళ్లిళ్లలో వధువులు చక్కగా తెల్లటి గౌను వేసుకుని చక్కగా ముస్తాయి అయి వేదికపైకి నడిచి వస్తుంటూ ఆమె కలల కళ్లల్లో మెదిలేది. కాసేపు ఆమె నిరుత్సాహపడిపోయేది. ఈ క్రమంలో బామ్మ క‌ల గురించి తెలిసిన ఆమె మ‌న‌వ‌రాలు ఆమె కోరిక తీర్చటంతో మార్తా మూన్ టక్కర్ ఆనందం అంతా ఇంతా కాదు. వయస్సు మారినా కల మాత్రం నెరవేరింది.

గౌను కలకు అడ్డుగా నిలిచిన జాతి వివక్ష..
మార్తా టక్కర్ వివాహం 1952లో జరిగింది. ఆ స‌మ‌యంలో వారు ఉంటున్న ప్రాంతంలో న‌ల్లజాతీయుల ప‌ట్ల వివ‌క్ష చాలా ఎక్కువ‌గా ఉండేది. నల్లజాతీయులను బ్రైడల్ షాప్స్‌లోకి కూడా రానిచ్చేవారు కాదు. దీంతో మూన్ త‌న పెళ్లి రోజున అద్దెకు తీసుకున్న బ‌ట్ట‌ల‌ే వేసుకోవాల్సి వచ్చింది. అప్పటి నుంచి మూన్ కు ‘పెళ్లి రోజు సొంతంగా కొనుక్కొని గౌను ధ‌రించ‌లేక‌పోయాను’అనే అసంతృప్తి అలాగే ఆమె మన‌సులో ఉండిపోయింది. ఈక్రమంలో మూన్ మనుమరాలు ఏంజెలా..బామ్మ మనస్సులోని కోరిక తెలుసుకుంది. అర్థం చేసుకుంది. బామ్మను దగ్గరుండి బ్రైడల్‌ షాప్‌కు తీసుకెళ్లి ‘పెళ్లి గౌను’ కొనిచ్చింది.

ఆ పెళ్లి గౌను ధరించిన మూన్ తెగ సంబ‌ర‌ప‌డిపోయింది. ఆ గౌను వేసుకుని అటూ ఇటూ తిరిగింది. అద్ధంలో తనను తాను చూసుకుని చిన్నపిల్లలా కేరింతలు కొట్టింది. ఇదంతా వీడియో తీసిన త‌న మ‌న‌వ‌రాలు సోష‌ల్ మీడియాలో పోస్టు చేసింది. తమ భవిష్యత్తు బాగుండాలనే మా బామ్మ ఆమె జీవితంలో ఎన్నో త్యాగాలు చేసిందనీ..బామ్మ కోరిక నెరవేర్చినందుకు తనకు చాలా సంతోషంగా ఉందని ఏంజెలా ఆ పోస్టులో తెలిపింది. పెళ్లి గౌనులో బామ్మను చూసిన నెటిజన్లు కూడా సంబరపడుతున్నారు. ఈ పెళ్లి కూతురు చాలా అందంగా ఉందని..అదొక ప్రత్యేకమైన అందమని అంటున్నారు. జాతి వివక్ష ఆమె చిన్న కోరికు అడ్డుగా నిలవటం చాలా దురదృష్టకరమని అంటున్నారు. ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.