Birth of Earth : భూమి పుట్టుక గురించి కొత్త ఆధారాలు..అక్కడి నుంచే పుట్టిందంటున్న శాస్త్రవేత్తలు

భూమి పుట్టుక గురించి కొత్త ఆధారాలు..కనుగొన్నారు శాస్త్రవేత్తలు.భూమి ఎప్పుడు పుట్టింది..?ఎలా పుట్టింది..? భూమి వయస్సు ఎంత? ఇలా మనతో ఈ భూమి పుట్టుక గురించి ఇదే సరైన సమాధానమా?!

Birth of Earth : భూమి పుట్టుక గురించి కొత్త ఆధారాలు..అక్కడి నుంచే పుట్టిందంటున్న శాస్త్రవేత్తలు

Scientists Discover New Evidence About The Origin Of The Earth

Birth of Earth : భూమి ఎప్పుడు పుట్టింది..? ఎలా పుట్టింది..? అసలు భూమి వయస్సు ఎంత? ఇలా మనతో పాటు సమస్త ప్రాణికోటి నివసించే ఈ భూమి పుట్టుక గురించి ఎన్నో ప్రశ్నలు..మరెన్నో అనుమానాలు..ఇంకెన్నో అభిప్రాయాలు. అయితే దీనికి సంబంధించిన సమాచారం చాలావరకు ఎవరికీ తెలియదు.. కొంతమంది కొన్ని రకాల సమాధానాలు ఇచ్చినా అవి అందర్నీ సంతృప్తి పరచకపోగా మరిన్ని సమాధానాల కోసం అందరూ వెతుకుతున్నారు. ఈక్రమంలో భూమి పుట్టుక గురించి శాస్త్రవేత్తలు సరికొత్త విషయాన్ని కొనుగొన్నారు.

దాదాపు 450 మిలియన్ సంవత్సరాల కిందట మహా విస్ఫోటనం కారణంగా భూమి ఏర్పడిందని అంటుంటారు. కానీ అది క‌చ్చితంగా ఎలా ఏర్ప‌డింది? భూమిలోని మూడు పొర‌ల్లో కింది రెండింట్లో అస‌లు ఏముంది? అన్న విష‌యాల‌పై మాత్రం మ‌న‌కు ఇంకా స్ప‌ష్టత లేదు. వీటిపై పరిశోధనలు జరుగుతునే ఉన్నాయి. భూమి వింత అందమైన నిర్మాణం ఇప్పటికీ అంతుచిక్కని రహస్యంగానే ఉంది. దీనిపై ఎన్నో ఆసక్తికర ప్రశ్నలు కొనసాగుతున్నవేళ భూ అంతర్భాగం (ఎర్త్‌ కోర్,‌)(Earth core) నుంచి లీకవుతున్న హీలియం, భూమి పుట్టుకపై కొత్త ఆధారాలను తెలియజేస్తోంది. ఎర్త్‌ కోర్‌ నుంచి హీలియం-3 వాయువు భారీగా లీకవుతున్నట్లు తాజాగా శాస్త్రవేత్తలు గుర్తించారు.

Also read :  Asteroid : భూమివైపు దూసుకొస్తున్న గ్రహశకలం.. తాజ్ మహల్ కంటే 3 రెట్లు పెద్దదట!

నక్షత్రాల పుట్టుకకు కారణమైన ఈ వాయువు సౌర కుటుంబంలోని నెబ్యులా (నక్షత్ర దుమ్ము, ధూళి) లో ఎక్కువగా ఉంటుంది. నాసా ప్రకారం.. దుమ్ము, ధూళితో పాటు హైడ్రోజన్, హీలియం వంటి వాయువుల సమూహం నెబ్యులా. వీటిలో అధికంగా ఉండే హైడ్రోజన్, హీలియం క్రమంగా స్వీయ ఆకర్షణకు గురై ధూళి, వాయువులుగా మారతాయి. అనంతరం ఆయా అణువుల మధ్య మరింత ఆకర్షణ పెరిగి ఘనపదార్థాలుగా రూపాంతరం చెందుతాయి. ఈ పదార్థం పరిమాణం పెరిగే కొద్దీ దాని గురుత్వాకర్షణ శక్తి కూడా పెరుగుతుంది.

ఒకవేళ..భూమి కూడా ఇలాగే ఏర్పడి ఉంటే భూ వాతావరణంలో భారీగా హీలియం వాయువు ఉండాలి. కానీ.. 4 బిలియన్ సంవత్సరాల కిందట ఒక భారీ అంతరిక్ష శిల భూమిని ఢీకొట్టి ఉంటుందని..అప్పుడు భూవాతావరణం, ఉపరితలంపై ఉన్న హీలియం అంతరిక్షంలో కలిసి ఉంటుందని సైంటిస్టులు భావిస్తున్నారు. ఇప్పటికీ ప్రతీ సంవత్సరం దాదాపు 2 కిలోల హీలియం-3 వాయువు భూమి నుంచి లీకవుతోందని తెలిపారు. భూ లోపలి పొరల్లోని ఈ లీకేజీపై మరింత లోతైన అధ్యయనం జరగాల్సి ఉందని శాస్త్రవేత్తలు ఈనాటికి అభిప్రాయపడుతున్నారు.

Also read : 1.3 KM wide asteroid : భూమి వైపుకు మరోసారి వేగంగా దూసుకొస్తున్న1.3 కిలోమీటర్ల గ్రహశకలం

భూ అంతర్భాగంలో హీలియం- 3 వాయువు ఉండటం భూమి సోలార్‌ నెబ్యులా నుంచి ఆవిర్భవించిందనడానికి బలమైన ఆధారమని సైంటిస్టులు సరికొత్తగా కనుగొన్నారు. అదే విషయాన్ని తెలిపారు. కోట్లాది సంవత్సరాల క్రితం భూమి ఆవిర్భావం జరిగింది. కానీ అది ఎలా జరిగిందనే విషయమై పలు ఊహాగానాలు ఈనాటికి కొనసాగుతునే ఉన్నాయి. బిగ్‌బ్యాంగ్‌ తరువాత సూర్యుడి పుట్టుక సందర్భంగా భూమి కూడా ఆవిర్భవించి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

రూ.2.25 కోట్ల విరాళంహీలియం-3 వాయువు నిల్వలు ఇంకా భూమి అంతర్భాగంలో భారీగా ఉండొచ్చని భావిస్తున్నారు. తాజా పరిశోధన ఫలితాలను జర్నల్‌ ఏజీయూ జియోకెమిస్ట్రీ, జియోఫిజిక్స్, జియోసిస్టమ్స్‌లో ప్రచురించారు. భూమి నిర్మాణం, పరిణామ సమయంలో అస్థిర మార్పిడి మెటాలిక్ కోర్‌ను లీక్ రిజర్వాయర్‌గా సూచిస్తుంది.. ఇది భూమి మిగిలిన భాగాలకు హీలియం-3ని సరఫరా చేస్తుందని వెల్లడించారు.