Crypto Currency: భారీగా పతనమైన బిట్ కాయిన్ విలువ.. 20వేల డాలర్ల దిగువకు

ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలో అస్థిర పరిస్థితుల కారణంగా స్టాక్ మార్కెట్ తో పాటు క్రిప్టో మార్కెట్లు పతనం దిశగా కొనసాగుతున్నాయి. గత కొద్దిరోజులుగా క్రిప్టో కరెన్సీలు భారీగా పతనమవుతున్నాయి. ముఖ్యంగా క్రిప్టో కరెన్సీలో అత్యధిక విలువ కలిగిన బిట్ కాయిన్ శనివారం సాయంత్రం నాటికి భారీ పతనాన్ని చవిచూసింది.

Crypto Currency: భారీగా పతనమైన బిట్ కాయిన్ విలువ.. 20వేల డాలర్ల దిగువకు

Cripcro

Crypto Currency: ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలో అస్థిర పరిస్థితుల కారణంగా స్టాక్ మార్కెట్ తో పాటు క్రిప్టో మార్కెట్లు పతనం దిశగా కొనసాగుతున్నాయి. గత కొద్దిరోజులుగా క్రిప్టో కరెన్సీలు భారీగా పతనమవుతున్నాయి. ముఖ్యంగా క్రిప్టో కరెన్సీలో అత్యధిక విలువ కలిగిన బిట్ కాయిన్ శనివారం సాయంత్రం నాటికి భారీ పతనాన్ని చవిచూసింది. పెట్టుబడిదారులు ఇకపై పెట్టుబడి పెట్టడానికి నిరాకరించడంతో ప్రధాన క్రిప్టో కరెన్సీలు ఇప్పట్లో కోలుకునే పరిస్థితి కనిపించడం లేదు. CoinMarketCap నుండి వచ్చిన డేటా ప్రకారం.. క్రిప్టో మార్కెట్ విలువ $900 బిలియన్ల దిగువకు పడిపోయింది. భారత కాలమానం ప్రకారం.. శనివారం మధ్యాహ్నం సమయంలో $853.11 బిలియన్ల వద్ద ఉంది.

Bit Coin

Crypto Currency: క్రిప్టో కరెన్సీపై కొత్త రూల్స్.. ఉల్లంఘిస్తే.. నో బెయిల్.. ఓన్లీ జైల్!

ఈ క్రిప్టో విలువ గత కొద్దిరోజులతో పోల్చితే 5.41 శాతం తగ్గింది. పెట్టుబడిదారులు తీవ్ర భయాందోళనలో ఉన్నారు. US ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను 75బేసిస్ పాయింట్లు భారీగా పెంచిన సమయంలో బేర్ మార్కెట్లలో ప్రవేశించామని పెట్టుబడిదారులు పేర్కొంటున్నారు. ఇక క్రిప్టో కరెన్సీ అయిన బిట్ కాయిన్ విలువ వరుసగా 12రోజులుగా పతనమవుతూనే వస్తోంది. గత వారం రోజుల్లో ఈ కాయిన్ విలువ 34శాతం పతనమైంది. 2020 డిసెంబర్ తర్వాత తొలిసారిగా 20వేల డాలర్ల దిగువకు చేరింది. తాజాగా బిట్‌కాయిన్ ధర $18,739.50 వద్ద ఉంది. 2021తో పోల్చుకుంటే ప్రస్తుతం బిట్ కాయిన్ విలువ 72శాతానికి పైగా పడిపోయింది.

Bit Coien

Viral Video: విద్యార్థినిలతో కలిసి సెప్టులు వేసిన యంగ్ టీచర్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో..

ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్వోల్బణ భయాలు అలుముకున్నాయి. అమెరికాలో ధరల పెరుగుదల రేటు 40ఏళ్ల గరిష్టానికి చేరింది. దీంతో ఫెడ్ బుధవారం ఒక్కసారి 0.75 వడ్డీరేటు పెంచింది. ద్రవ్యోల్బణం అదుపులోకి రాకపోతే మరిన్ని రేట్లు పెంపులు ఉండొచ్చని సంకేతాలిచ్చింది. మరిన్ని దేశాల కేంద్ర బ్యాంకులూ వడ్డీ రేట్లు పెంచుతాయనే అంచనాలు పెరిగాయి. ఇందువల్ల ఆర్థిక మాంద్యం ఏర్పడుతుందనే ఆందోళన పెరిగింది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లు సహా క్రిప్టో మార్కెట్లు గత కొన్ని రోజులుగా తీవ్ర ఒత్తిడిలో కొనసాగుతున్నాయి.